ASBL NSL Infratech

డార్లింగ్ కోసం స్టార్ బ్యూటీలు

డార్లింగ్ కోసం స్టార్ బ్యూటీలు

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ల్కి షూటింగ్ పూర్తి చేసుకున్న ప్ర‌భాస్, ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే మారుతి, ప్ర‌భాస్ పైన ఓ సాంగ్ ను షూట్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే ప్ర‌భాస్-సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ మూవీ స్టార్ట్ కానుంది.

ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో సందీప్ స్పిరిట్ సినిమాను డిసెంబ‌ర్ లో ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్లు తెలిపాడు. సందీప్ తో ప్ర‌భాస్ చేసే సినిమా ప్ర‌భాస్ కు 25వ సినిమా కావ‌డంతో ఆ సినిమా విష‌యంలో సందీప్ ప‌క్కా ప్లాన్ తో ముందుకెళ్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే స్పిరిట్ లో హీరోయిన్ కోసం సందీప్ వెతుకుతున్నాడు.

రీసెంట్ గా ర‌ష్మిక‌, మృణాల్, కీర్తి సురేష్ పేర్ల‌ను ప‌రిశీలించిన సందీప్, ర‌ష్మికను ఫైన‌ల్ చేసిన‌ట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ హీరోయిన్ గా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ స్పిరిట్ లో హీరోయిన్ గా న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సందీప్, కియారాను ఈ మేర‌కు సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. మ‌రో హీరోయిన్ పాత్ర కోసం న‌య‌న‌తారను తీసుకోవాల‌ని సందీప్ చూస్తున్నాడ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :