ASBL NSL Infratech

గేమ్ ఛేంజ‌ర్ గురించి న‌వీన్ చంద్ర లీకులు

గేమ్ ఛేంజ‌ర్ గురించి న‌వీన్ చంద్ర లీకులు

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా గేమ్ ఛేంజ‌ర్. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఎస్.జె సూర్య విల‌న్ గా క‌నిపించబోతున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కార్తిక్ సుబ్బారుజు క‌థ అందించ‌డం విశేషం.

రామ్ చ‌ర‌ణ్ కెరీర్లోనే గేమ్ ఛేంజ‌ర్ బెస్ట్ సినిమా అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో న‌వీన్ చంద్ర న‌టిస్తున్న‌ట్లు చెప్పాడు. అంతేకాదు నవీన్ చంద్ర గేమ్ ఛేంజ‌ర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో త‌న పాత్ర చాలా కీల‌క‌మ‌ని, సినిమా ఆరంభంలో చాలా పాజిటివ్ గా ఉండే పాత్ర ఆ త‌ర్వాత వైల్డ్ విల‌న్ గా రివీల్ అవుతుంద‌ని తెలిపాడు.

ఆ సీక్వెన్స్ లో వ‌చ్చే ట్విస్ట్ మొత్తం సినిమాకే హైలైట్ కానుంద‌ని నవీన్ చెప్పాడు. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్ లో న‌వీన్ కూడా ఒక విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని ఫిక్స్ అయిపోయింది. న‌వీన్ తో పాటూ ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో కనిపించ‌బోతున్నాడు. గేమ్ ఛేంజ‌ర్ లో న‌వీన్ న‌టిస్తున్నాడ‌నే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :