దేవర తర్వాత సైఫ్ కు ఆఫర్లే ఆఫర్లు?
40 ఏళ్లుగా బాలీవుడ్ లో తన ఫామ్ ను కొనసాగిస్తున్న సైఫ్ అలీ ఖాన్ అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచాడు. సోలో హీరోగా కూడా సైఫ్ తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పటికీ సైఫ్ తన కెరీర్ ను చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు. యాక్టర్ అంటే కేవలం లీడ్ రోల్ చేయడమే కాదు సినిమాలో భాగం అవ్వడమే అని నమ్మిన సైఫ్ తనకు సెట్ అయ్యే క్యారెక్టర్లు వస్తే చాలు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆయన విలన్ గా కూడా పలు సినిమాలొచ్చాయి.
అయితే ఇన్నేళ్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన సైఫ్ ఇప్పుడు దేవర సినిమాతో సౌత్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి సైఫ్ విలన్ గా మారుతున్నాడు. దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సైఫ్, భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు. దేవర సినిమాలో సైఫ్ నటనకు ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతారంటున్నారు.
దేవరలో సైఫ్ పాత్రకు చాలా పేరొస్తుందని, దేవరలో ఆయన విలనిజం చూశాక సైఫ్ కు సౌత్ నుంచి పలు ఛాన్సులొస్తాయని అంటున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సైఫ్ క్యారెక్టర్ క్లిక్ అయితే, దేవర2 వచ్చే లోపే సైఫ్ మరో రెండు మూడు ప్రాజెక్టులు ఓకే చేస్తాడంటున్నారు. మరి దేవర సైఫ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.