ASBL NSL Infratech

యూనిఫాం సివిల్‌ కోడ్‌ ను బాబు వ్యతిరేకిస్తాడా.. విజయ్ సాయి రెడ్డి

యూనిఫాం సివిల్‌ కోడ్‌ ను బాబు వ్యతిరేకిస్తాడా.. విజయ్ సాయి రెడ్డి

అధికార వైసీపీ ఇప్పటికే రాబోయే ఎన్నికలకు తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు లోక్ సభ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి..నెల్లూరు లోక్‌ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి 46 హామీలతో మరొక లోకల్ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ సారి తమ పార్టీ నెల్లూరు లోక్‌ సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కలలు సాకారం చేసే ధైర్యం ఒక వైసీపీకి మాత్రమే ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే..యూనిఫాం సివిల్‌ కోడ్‌ ను తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. అయితే కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు దీన్ని అడ్డుకుంటారా.. ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌ ను తెలుగుదేశం సమర్ధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ విషయం ఎన్నిసార్లు అడిగినా బాబు స్పష్టంగా చెప్పకుండా దాటివేస్తారని వెల్లడించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :