ASBL NSL Infratech

వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌కు అస‌లు కార‌ణం

వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌కు అస‌లు కార‌ణం

ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ఉన్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ హైప్ ఉన్న సినిమా అంటే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. కానీ ఆ సినిమా మొద‌లై ఎప్పుడో మూడేళ్ల‌వ‌డం, షూటింగ్ లో విప‌రీత‌మైన జాప్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల మామూలు సినీ ప్రేక్ష‌కుల‌తో పాటూ స‌గ‌టు పీకే ఫ్యాన్స్ కు కూడా ఆ ఆశ‌లు ఆవిరైపోయాయి. వీర‌మ‌ల్లును ముందు అనౌన్స్ చేసిన‌ప్పుడు, ఆ సినిమా పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన‌ప్పుడు ఫ్యాన్స్ కు ఇచ్చిన హై మామూలుగా లేదు.

కానీ క్రమేపీ ఆ హై, బ‌జ్ త‌గ్గిపోయాయి. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ మొద‌లుపెట్టిన వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్, బ్రో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కూడా అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి మేక‌ర్స్ అప్డేట్ ఇచ్చారు. మే 2న వీర‌మ‌ల్లు టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇంత స‌డెన్ గా అలా టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డం వెనుక పెద్ద స్టోరీనే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఎల‌క్ష‌న్స్ అవ‌గానే ప‌వ‌న్ ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను పూర్తి చేస్తాడు. వీటికి బిజినెస్ డీల్స్ ప‌రంగా ఎలాంటి ఢోకా లేదు. థియేట్రిక‌ల్ ఇబ్బంది కూడా లేదు. మంచి రేటుకు ఓటీటీ డీల్స్ కూడా జ‌రిగాయి కాబ‌ట్టి నిర్మాత‌లు సేఫ్. కానీ వీర‌మ‌ల్లు విష‌యంలో అలా కాదు. ఈ సినిమాను నెక్ట్స్ ఇయ‌ర్ రిలీజ్ చేయాల‌న్నా స‌రే ఇప్ప‌టినుంచే ప్లాన్స్ చేసుకోవాలి. ఈ సినిమాపై పూర్తిగా త‌గ్గిన బ‌జ్ ను పెంచాలంటే ఈ టైమ్ లో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డ‌మే బెస్ట్ ఆప్ష‌న్ అని వీర‌మ‌ల్లు మేక‌ర్స్ ఈ డెసిష‌న్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :