ASBL NSL Infratech

కెరీర్లోనే మొద‌టిసారి బ‌న్నీ అలా?

కెరీర్లోనే మొద‌టిసారి బ‌న్నీ అలా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప‌2 అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆగ‌స్ట్ 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పుష్ప‌2 త‌ర్వాత బ‌న్నీ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్నది ఇంకా క‌న్ఫ‌ర్మ కాలేదు. డైరెక్ట‌ర్ అట్లీ బ‌న్నీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి కానీ ఇప్ప‌టివ‌ర‌కు అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.

ఇదిలా ఉంటే మ‌రోవైపు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ బ‌న్నీ కోసం ఓ సూప‌ర్బ్ స్టోరీని రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో సినిమా కోసం త్రివిక్ర‌మ్ భారీ స్కెచ్ వేసిన‌ట్లు స‌మాచారం. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం, ఈ సినిమాలో బ‌న్నీ త‌న కెరీర్లోనే మొద‌టిసారి డ‌బుల్ యాక్ష‌న్ చేయ‌బోతున్నాడ‌ని, రెండే క్యారెక్ట‌ర్లు దేనిక‌వే స్పెష‌ల్ గా, షాకింగ్ ఎలిమెంట్స్ తో ఉంటాయ‌ని తెలుస్తోంది.

త్రివిక్రమ్ మొద‌టిసారి త‌న రెగ్యుల‌ర్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన్మెంట్ ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ ఫాంట‌సీ ట‌చ్ ఉన్న భారీ స‌బ్జెక్ట్ ను బ‌న్నీ కోసం రెడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. గుంటూరు కారం త‌ర్వాత అస‌లు మీడియాకు కనిపించ‌కుండా తిరుగుతున్న త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఈ స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ లో బిజిగా ఉన్నాడ‌ట. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే జులైలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వ‌చ్చే ఛాన్సుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :