రివ్యూ : రొటీన్ కథ 'జయదేవ్' తో కొత్త హీరో ఘంటా రవి పరిచయం

రివ్యూ : రొటీన్ కథ 'జయదేవ్' తో కొత్త హీరో ఘంటా రవి పరిచయం

30-06-2017

రివ్యూ : రొటీన్ కథ 'జయదేవ్' తో కొత్త హీరో  ఘంటా రవి పరిచయం

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5

బ్యానర్ : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్,

నటీనటులు : గంటా రవి, మాళవిక రాజ్, వినోద్ కుమార్, రవి ప్రకాష్వె, న్నెల కిశోర్,
పరుచూరి వెంకటేశ్వర్ రావు, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కాదంబరి కిరణ్ కుమార్, శివ రెడ్డి, జ్యోతి తది తరులు నటించారు.
సినిమాటోగ్రఫీ :జవహర్ రెడ్డి, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ,
మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం : మణిశర్మ, 
నిర్మాత : కె. అశోక్ కుమార్,
దర్శకత్వం : జయంత్ సి. పరాంజీ,

విడుదల తేదీ:30.06.2017

దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ ల కాంబినేషన్ లో గతం  విక్టరీ వెంకటేష్ తో  'ప్రేమంటే ఇదేరా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పరిచయం చేసిన 'ఈశ్వర్' వంటి సినిమా లను అందించిన ఈ బ్యానర్ లో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాస రావు తనయుడు ఘంటా రవి తేజ ను పరిచయం చేస్తూ, తమిళం లో విజయవంతమైన 'సేతుపతి' ని రీమేక్ చేస్తూ రూపొందించిన చిత్రం 'జయదేవ్ ' ఈ రోజు విడుదల అయ్యింది మరి కొత్త కుర్రాడు ఎంత వరకు సక్సెస్ అయ్యాడు, జయంత్ సి పరాన్జీ గత చిత్రాల వైభవం మళ్ళి సాదించగలిగాడా సమీక్షా లో చూద్దాం.....

కథ: 

జయదేవ్ (గంటా రవి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. అన్యాయాన్ని సహించని జయదేవ్ ఎవరికి భయపడే రకం కాదు. మరో సిన్సియర్ పోలీస్ యస్ ఐ  శ్రీరాం (రవిప్రకాశ్) అక్రమముగా క్వారీ తవ్విస్తున్న  మస్తాన్ రాజు  (వినోద్ కుమార్) కి సంబందించిన సాక్షాలు సంపాదించడం తో యస్ ఐ  శ్రీరాం ని  హత్య చేయిస్తాడు మస్తాన్ రాజు  దీనికి సంబందించిన  కేసు జయదేవ్ స్టేషన్ కు వస్తుంది. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన జయదేవ్ దీని వెనుక బడా బాబులు ఉన్నారని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో  కేసు కు సంబంధిచిన ముఖ్య మైన సాక్షి ని శ్రీ రామ్ భార్యాను కూతురి కూడా   హత్య  చేయించి ఆ నేరం ప్లాన్ ప్రకారం జయదేవ్ పై వచ్చేటట్టు చేసి సర్వీస్ లో సస్పెండ్ అయ్యేలా చేస్తాడు  మస్తాన్ రాజు. ఈ కాసు లో   జయదేవ్ ఎలా  విజయం సాధించాడు తన ఉద్యోగం తిరిగి ఎలా సంపాదించాడన్నదే ..?  మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

జయదేవ్ గా టైటిల్ రోల్ పోషించిన  గంటా రవి తన వరకు తాను బాగానే చేశాడని చెప్పొచ్చు. మొదటి ప్రయత్నం కదా  పర్వాలేదు. అయితే ఎమోషనల్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ విషయంలో ఇంకా ఎంతో  పరిణితి చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. హీరోయిన్ కేవలం గ్లామర్ డాల్ గా  మాత్రమే అన్నట్టు ఉంటుంది. ఇక కమెడియన్స్ వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి అప్పుడపుడు  నవ్వించే ప్రయత్నం చేశారు. వినోద్ కుమార్ చాలా రోజుల తర్వాత విలన్ గా ఫుల్ లెంథ్ రోల్ చేశారు. సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిగతా వారంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పని తీరు:

చాలా కాలం తరువాత డైరక్టర్ జయంత్ చేసిన ఈ ప్రయత్నం విఫలమయ్యిందని చెప్పొచ్చు. కొత్త హీరోని పరిచయం చేసే క్రమంలో అతన్ని ఇంకా వర్క్ అవుట్ చేయించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. తమిళం లో హిట్టయ్యిన 'సేతుపతి' మాతృక ను  ఒక పోలీస్ కథ  ని  తీసుకుని కొన్ని మార్పులు చేసినా ఈ  సినిమా లో    రొటీన్ గానే అనిపిస్తుంది.  డైలాగ్స్  మాత్రం అక్కడక్కడ బాగా వచ్చాయి. సినిమా రిచ్ గా తీయడంలో మాత్రం ది బెస్ట్ అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మినహా  మణిశర్మ మ్యూజిక్ ఏమాత్రం బాగోలేదు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయొచ్చు. ఫైనల్ గా రిచ్ ప్రొడక్షన్ తో సినిమా వచ్చింది. 

విశ్లేషణ :

కథ కథనాలు పాతవే అన్నట్టు కనిపించినా కథలో ఫీల్ మాత్రం దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అయితే హీరో గంటా రవి ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది. పోలీస్ శాఖకు సంబందించిన సీన్స్ కొన్ని ఆసక్తికరంగా సాగాయి. అయితే మొదటి భాగం ఎలాగోలా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో హీరో విలన్ల మధ్యే సీన్స్ ఎక్కువ రాసుకున్నాడని అనిపిస్తుంది. అవి బోర్ కొట్టించేస్తాయి.  ఫైనల్ గా క్లైమాక్స్ లో మాత్రం మళ్లీ సినిమాను ట్రాక్ ఎక్కించేశారు. ఓవరాల్ గా సినిమా రొటీన్ పోలీస్ కథే కాని కొత్త కుర్రాడు చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోవచ్చు.