జూలై 17 నుంచి 19 వరకు టిటిఎ మహాసభలు
అమెరికాలో తెలంగాణ అసోసియేషన్లలో పెద్దదైన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మహాసభలు ఛార్లెట్ నగరంలో జూలై 17 నుండి 19 వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, యువత మరియు మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, సాహిత్య గోష్టులు, బిజినెస్ సెమినార్లు, సి.ఎమ్.ఇ సెమినార్లు,ఆధ్యాత్మిక సమావేశాలు మరియు వివాహ పరిచయ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మరోవైపు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కో ఆర్డినేటర్ గా నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టిటిఎ పెద్దలు పైళ్ల మల్లారెడ్డి, విజయ్ పాల్ రెడ్డి, మోహన్ రెడ్డి పాటలోల్ల, భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు తదితరుల సూచనలు, సలహాలతో ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నారు. టిటిఎ మహాసభలను మొదటిసారిగా షార్లెట్ నగరానికి టిటిఎ నాయకులు తీసుకువస్తున్నారు. మన వారసత్వాన్ని పండుగలా జరుపుకోవడానికి, సరికొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి ఈ చారిత్రాత్మక కన్వెన్షన్‌లో అందరూ భాగస్వాములు కావాలని టీటీఎ నాయకులు కోరుతున్నారు.
ఈ భారీ ఈవెంట్‌కు ఫస్ట్ ఇన్ఫ్రా సంస్థ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి గారి ‘లైవ్ కాన్సర్ట’ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ‘ఆరెంజ్ స్ట్రీట’, ‘త్రీఓరి’ ల ప్రదర్శనలు ప్రత్యేక వినోదాన్ని పంచనున్నాయి. అలాగే ‘పరంపర’, ‘గ్రెగరీ హ్యాన్‌కాక్ డాన్స్ థియేటర’ బృందాలచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులతో పాటు పలువురు ప్రముఖులు, మ్యూజిక్ ట్రూప్స్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
‘టి.టి.ఎ యూత్ బ్యాంక్వెట’ మరియు ‘యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ’ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.ఇందులో రసవత్తరమైన సంగీతం, లైవ్ వినోద కార్యక్రమాలు. ఇంటరాక్టివ్ నాస్కార్ సిమ్యులేషన్స్. హై-ఎనర్జీ డ్యాన్స్ ఫ్లోర్, రుచికరమైన విందు భోజనం. ప్రత్యేక అతిథులతో ‘మీట్ అండ్ గ్రీట’ వంటి కార్యక్రమాలు ఉంటాయి. వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత కలిగిన 12 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థుల కోసం ప్రముఖ వ్యాపార ప్రదర్శన ‘షార్క్ ట్యాంక’ తరహాలో ‘యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి భారీ నగదు బహుమతులతో పాటు, ఇంటర్న్‌షిప్ చేసే సువర్ణావకాశం లభించనుంది.
బిజినెస్ ఫోరమ్‌లో ఐమాక్ డెన్వర్ సీఓ, ప్రెసిడెంట్, ప్రముఖ శాస్త్రవేత్త , నోబెల్ ప్రైజ్ నామినీ డా.ఎం.ఎస్.రెడ్డి ముఖ్య వక్తగా హాజరుకానున్నారు. నూతన వధూవరుల పరిచయాల కోసం ‘మూడు ముళ్ల అనుబంధం… టీటీఏ మ్యాట్రిమోనీ తో ఆరంభం’ అనే నినాదంతో ప్రత్యేక ‘మ్యాట్రిమోనీ మీట్ అండ్ గ్రీట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ వేడుకల్లో భాగంగా జులై 19న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ‘శ్రీ శ్రీనివాస కళ్యాణం’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన అర్చకులు, ఉత్సవ మూర్తుల సమక్షంలో ఈ కళ్యాణోత్సవం జరగనుంది అలాగే అందాల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు.
రీల్స్ పోటీ
అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే టిట్గి మెగా కన్వెన్షన్ 2026’ను పురస్కరించుకుని, నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక ప్రత్యేకమైన ‘రీల్స్ పోటీ’ని ప్రకటించారు. జులై 17 నుండి 19, 2026 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ మహాసభల విశిష్టతను చాటిచెప్పేలా క్రియేటర్లు వీడియోలు రూపొందించాలని కోరారు. 5,000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉండి, అర్హత కలిగిన రీల్స్ సమర్పించే క్రియేటర్లకు ఉచిత జనరల్ అడ్మిషన్ పాస్ లభిస్తుంది. మొదటి ముగ్గురు విజేతలకు ప్రత్యేకమైన TTA మెమెంటోలు, VIP యాక్సెస్ పాస్‌లు , సెలబ్రిటీలతో నేరుగా కలిసే అవకాశం కల్పించనున్నారు. ఈ పోటీకి ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 5, 2026. ఎంత త్వరగా రీల్స్ పోస్ట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ లభిస్తుందని, క్రియేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.








