హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఓ రక్షణ రేఖ
కరోనా సోకకుండా తాను రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సమర్థించుకున్నారు. వైరస్ సోకకుండా ఈ మందు ఓ రక్షణ రేఖగా పనిచేస్తుందన్నారు. దీని గురించి భయం వద్దని, మరికొంత కాలం తాను ఈ ఔషధాన్ని తీసుకుంటానని వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఈ ఔషధం మెరుగైన ఫలితాలు చూసిన అధ్యయనాలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు దీన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం లేదన్నారు.






