వైభవంగా టిఎల్‌సిఎ దీపావళి

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను వైభవంగా జరిపారు. నవంబర్ 12వ తేదీన న్యూయార్క్‌లోని ప్లషింగ్‌లో ఉన్న గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా సినీ హీరో శ్రీకాంత్, నటి ఊహ, యువ హీరో రోషన్, హీరోయిన్ కమలిని ముఖర్జీ, సత్యకృష్ణన్ తదితరులు వచ్చారు. వీనులవిందుగా సాగిన వేడుకల్లో గాయనీ గాయకులు అనుదీప్, లిప్సిక, సౌజన్య, విజయలక్ష్మీ, గుంటా హరి, దీప్తినాగ్, జానపద పాటల గాయని షాలిని తమ స్వరాలతో పాటలను పాడి అందరినీ మైమరపింపజేశారు. పాత, కొత్త చిత్రాల నుంచి వారు పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ వేడుకల విజయవంతానికి ఎంతోమంది సహకరించారని వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు సత్య చల్లపల్లి తెలిపారు.