ATA: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆటా బృందం..
న్యూయార్క్: అమెరికా తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు తెలుగు ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది అందరి జీవితాల్లో నవ్వులు, విజయం, మంచి జ్ఞాపకాలు నిండాలని ఆకాంక్షించారు. 19వ ఆటా మహాసభలు, యువజన సదస్సు
ఈ సందర్భంగా రాబోయే ప్రతిష్టాత్మక 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ వివరాలను నిర్వాహకులు ఇదివరకే ప్రకటించారు.
తేదీలు: జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.
వేదిక: బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, 1 డబ్ల్యూ ప్రాట్ స్ట్రీట్, బాల్టిమోర్, MD 21201.
కార్యవర్గ బృందం
ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా నేతృత్వంలోని కార్యవర్గ కమిటీ కృషి చేస్తోంది. ఈ కమిటీలో కీలక సభ్యులుగా..
ప్రెసిడెంట్: జయంత్ చల్లా
ప్రెసిడెంట్ ఎలక్ట్: సతీష్ రామసహాయం రెడ్డి
పాస్ట్ ప్రెసిడెంట్: మధు బొమ్మినేని
సెక్రటరీ: సాయినాథ్ బోయపల్లి
ట్రెజరర్: శ్రీకాంత్ గుడిపాటి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నర్సిరెడ్డి గడ్డికొప్పుల
ఈ మహాసభలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.americanteluguassociation.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.






