తెలుగువారు ఇబ్బందులు పడకుండా సహాయపడమే నాట్స్ లక్ష్యం -శ్రీనివాస్ మంచికలపూడి
కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు కోవిడ్ 19 ఫండ్ రైజింగ్ మొదలు పెట్టాము. అవసరమైన వారికి సహాయం అందించేందుకు ఈ ఫండ్‌రైజింగ్ ను కొనసాగిస్తున్నాము. న్యూయార్క్, న్యూజెర్సి ఆసుపత్రులలో గవర్నమెంట్ ఇవ్వని టైమ్‌లోనే మేము వాళ్ళకు మాస్క్ లు పంపిణీ చేశాము. ఆతరువాత ఫెడరల్ గవర్నమెంట్ మాస్క్ లు ఇవ్వడం ప్రారంభించింది. దాంతో మేము మాస్క్ లు కోసం పెట్టే డబ్బును వేరే కార్యక్రమాలకు వినియోగించడం చేశాము.
అమెరికాలోని 17 నగరాల్లో నాట్స్ చురుకైన పాత్రను పోషిస్తోంది. అన్నీ సెంటర్స్‌లోని ఫుడ్బ్యాంక్లకు ఫుడ్ అందించడంతోపాటు ఫుడ్ పంపిణీ కార్యక్రమంలో కూడా నాట్స్ ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారు. వెబినార్స్ నిర్వహించి కోవిడ్ 19 మీద ఉన్న అపోహలు తొలగించి, జాగ్రత్తలు చెప్పాము. వెబినార్స్ ద్వారా స్టూడెంట్స్‌కి కూడా అవసరం అయిన సమాచారాన్ని అందించాము. ఇమ్మిగ్రేషన్ మీద వెబినార్స్ నిర్వహించాము. నాట్స్ తరపున ఇమ్మిగ్రేషన్ హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేశాము. ట్రంప్ ఇటీవల సంతకం పెట్టిన ఇమ్మిగ్రేషన్స్ పై అటార్నీ ద్వారా సరైన సమాధానాలు ఇప్పించాము.
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆంధప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ నాట్స్ వలంటీర్స్ ఉన్నారు. వారి ద్వారా మా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 90000 మాస్క్‌లను పంపిణీ చేశాము. దాదాపుగా 50000 మాస్క్‌లు తయారుచేయించి పంపిణీ చేయాలని మాసంకల్పం.
ఏప్రిల్ 29 నుంచి గుంటూరులో 3 రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆంధప్రదేశ్‌లోని నిడుబ్రోలులో ఉన్న అనాథాశ్రమంలో ఉన్న 250 మందికి, ఒంగోలులో ఉన్న 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాము.
తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచికల్ గ్రామంలో 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇచ్చాము. మోపిచిలకల గ్రామంలో కూడా నిత్యావసర వస్తువులను 100 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నాము. అమెరికాలో అన్నీ జాతీయ తెలుగు సంఘాలు బాగా పనిచేస్తున్నాయి. అందరికి అభినందనలు.













