ఫోర్బ్స్ జాబితాలో మైఖేల్ జాక్సన్ కు అగ్రస్థానం
దివంగత ప్రముఖుల్లో అత్యధిక చెల్లింపు పొందిన ఘనతను పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు 2018 ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది వ్యవధిలో జాక్సన్ సుమారు రూ.2,926 కోట్ల ఆదాయం పొందారు. ఇందులో ఎక్కువ భాగం ఈఎంఐ మ్యూజిక్ పబ్లిషింగ్ సంస్థలోని అతని వాటాను సోనీ సంస్థకు అమ్మగా వచ్చిన విలువే ఉంది. మైకేల్ జాక్సన్ 50వ ఏటా ఔషద మోతాదు అధికమైన కారణంగా 2009లో మరణించారు. మరో పాప్ దిగ్గజం ఎల్విస్ ప్రెస్లీ రూ.292 కోట్ల ఆదాయంతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గోల్ఫ్ క్రీడాకారులు ఆర్నాల్డ్ పాల్మెర్, కార్టూనిస్టు ఛార్లెస్ షుల్జ్, సంగీత, సాంస్కృతిక దిగ్గజం బాబ్మార్లే తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.













