అమెరికాలో మాటా అవార్డుల సందడి.. దరఖాస్తులకు మే 18 ఆఖరి తేదీ!
MATA: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో జూన్ నెలలో నిర్వహించ తలపెట్టిన రెండవ మహాసభల సందర్భంగా ‘మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ను ప్రదానం చేయనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించేందుకు ఈ పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వేదిక వివరాలు..
జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ (The Greater Philadelphia Expo Center) వేదికగా మటా రెండో కన్వెన్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేదికపైనే అమెరికాలో నివసిస్తున్న వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన తెలుగు వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు.
ఇవి కూడా చదవండి
అవార్డుల విభాగాలు..
కింద పేర్కొన్న విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని నామినేట్ చేయవచ్చు.
- వ్యాపారం (Business)
- సమాజ సేవ (Community Service)
- సాహిత్యం (Literature)
- జర్నలిజం (Journalism)
- సాంస్కృతిక సేవ (Cultural Service)
- యువత (Youth)
- క్రీడలు (Sports)
- ఇంజనీరింగ్ & ఐటీ
- సైన్స్ & టెక్నాలజీ
- వైద్యం
- ప్రైడ్ ఆఫ్ ఇండియా (Pride Of India)
దరఖాస్తు విధానం..
అర్హత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవలో నిబద్ధత కలిగిన వ్యక్తుల వివరాలను awards@mata-us.org అనే ఈమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది. నామినేషన్లు పంపేందుకు మే 18, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. మన కమ్యూనిటీలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారిని గుర్తించి గౌరవించే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మటా సభ్యులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి








