మంత్రి లోకేష్ కు ప్రతిష్టాత్మక ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ప్రదానం
సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆ దేశంలో అరుదైన గౌరవం లభించింది. విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్ సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.వి.ఎన్ బాలకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఎస్.ఆర్.నాధన్ ఫెలోషిప్‌ను అందజేసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ చైన్ వినియోగం, ఐటీ రంగ అభివృద్ధి కోసం నవ్యాంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి మంత్రి లోకేష్ నుండి బాలకృష్ణన్ పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి బ్లాక్ చైన్‌తో భద్రత కల్పిస్తున్నామని, రవాణా శాఖలో కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నట్లు లోకేష్ వివరించారు.













