షార్లెట్ టీటీఏ మహాసభల పోటీలకు ఆహ్వానం.. మే 20తో ముగియనున్న గడువు!
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’ సందడి అప్పుడే మొదలైంది. ఈ మహాసభల జ్ఞాపికగా వెలువరించే ‘టీటీఏ సోవనీర్ 2026’ (TTA Souvenir 2026) కోసం ప్రత్యేక సాహిత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు సోవనీర్ & లిటరరీ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
పోటీల వివరాలు..
ఈ సాహితీ వేదికలో భాగంగా మూడు ప్రధాన విభాగాలలో ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో రచనలను ఆహ్వానిస్తున్నారు.
- కథలు: స్ఫూర్తినిచ్చే ఏ రకమైన శైలికి చెందినవైనా ఉండవచ్చు (గరిష్టంగా 2 పేజీలు).
- వ్యాసాలు: ప్రస్తుత సామాజిక అంశాలపై రాజకీయాలకు అతీతంగా ఉండాలి (గరిష్టంగా 3 పేజీలు).
- కవితలు/పద్యాలు: ఛందస్సుతో కూడిన కవితలు (20 నుండి 40 లైన్లు).
బహుమతులు..
ప్రతి విభాగంలో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు.
- ప్రథమ బహుమతి: $200
- ద్వితీయ బహుమతి: $100
- తృతీయ బహుమతి: $50
నియమ నిబంధనలు:
రచనలు గతంలో ఎక్కడా ప్రచురితం కానివి , స్వంతమైనవి అయి ఉండాలి. ఎంపిక చేసిన ఉత్తమ రచనలను సోవనీర్లో , టీటీఏ త్రైమాసిక పత్రికలో ప్రచురిస్తారు. వీటితో పాటు జోక్స్, కార్టూన్లు , ఇతర కళాఖండాలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ రచనలను 2026 మే 20 లోపు ttaconvention.org/souvenir వెబ్సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
నిర్వాహకులు..
ఈ సోవనీర్, సాహిత్య కమిటీకి శ్రీనివాస్ గూడూరు (సోవనీర్ ఛైర్మన్), సుధాకర్ ఉప్పల (లిటరరీ ఛైర్మన్), ప్రసాద్ జోశ్యుల (చీఫ్ ఎడిటర్) నేతృత్వం వహిస్తున్నారు. సంస్థ ప్రధాన నాయకత్వంలో టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, అడ్వైజరీ కౌన్సిల్ నుండి ఫౌండర్ డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఛైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి మార్గనిర్దేశనం చేస్తున్నారు.
మరిన్ని వివరాలకు టీటీఏ హెల్ప్‌లైన్ 1-866-TTA-SEVA ను సంప్రదించవచ్చు.








