మే 30న ర్యాలీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా “పల్లె వంట”
GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ర్యాలీ చాప్టర్ ఆధ్వర్యంలో “పల్లె వంట” పేరుతో భారీ ఆన్సైట్ వంట , పిక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుక మే 30, 2026 శనివారం రోజున ఉదయం 11:30 గంటల నుండి అపెక్స్లోని వైట్ ఓక్ రిక్రియేషన్ ఏరియా (White Oak Recreation Area) వేదికగా జరగనుంది.
కార్యక్రమం విశేషాలు..
ప్రవేశ రుసుము: ఫ్యామిలీకి $35 , సింగిల్ పర్సన్ కు $15 గా నిర్ణయించారు.
వినోదం: పిల్లలు , పెద్దల కోసం ప్రత్యేక ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , వినోద భరితమైన కృత్యాలు ఉంటాయి.
నిర్వహణ: నేషనల్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ రవీందర్ గడ్డంపల్లి, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనబోయిన, జనరల్ సెక్రటరీ రామ్ సుశీల్ పాడూరి , ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
రిజిస్ట్రేషన్స్ వివరాలు..
ఈవెంట్, ఫుడ్ ప్రిపరేషన్, వెండర్ స్టాల్స్ , కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం వేర్వేరు క్యూఆర్ (QR) కోడ్ల ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ మెగా ఈవెంట్‌కు రాజ్ జువెల్స్ (Raj Jewels) గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, మరిన్ని వివరాల కోసం www.gtaraleigh.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








