మే 30న అట్లాంటాలో ‘తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం’!
GATeS: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రవాస భారతీయులకు చేరువ చేయడంలో ముందుండే గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం – 2026’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 30, శనివారం రోజు జరిగే ఈ వేడుకకు అట్లాంటాలోని ఆల్ఫారెట్టా వేదిక కానుంది.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 30, 2026 (శనివారం)
- సమయం: మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు
- వేదిక: డెన్మార్క్ హైస్కూల్ (645 Mullinax Rd, Alpharetta, GA 30004)
ప్రధాన ఆకర్షణలు..
ఈ వేడుకకు తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రథమ చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్లేబ్యాక్ సింగర్ స్వాతి రెడ్డి, ఫోక్ సింగర్ జనార్దన్ పన్నెల, , గాయని సృష్టి చెల్లా తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. వీటితో పాటు STRINGZ LIVE BAND ప్రత్యేక ప్రదర్శన సందడి చేయనుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ప్రవేశం: GATeS సభ్యులకు ఉచితం, ఇతరులకు $10 ప్రవేశ రుసుము ఉంటుంది.
రిజిస్ట్రేషన్: tinyurl.com/GATeSEventRegistration ద్వారా నమోదు చేసుకోవచ్చు.
స్టాల్స్: వ్యాపార ప్రదర్శన స్టాల్స్ కోసం tinyurl.com/VendorStall లో సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని GATeS ప్రెసిడెంట్ రమణ గండ్ర, బోర్డ్ చైర్మన్ జ్యోత్స్న పాలకుర్తి , ఇతర కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం gatesusa.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.








