చికాగో ఇండియా డే పెరెడ్లో సిఎఎ
ఇండియన్ కమ్యూనిటీ ఔట్ రీచ్, రోటరీ హిల్, నేపర్విల్లేలో ఆగస్టు 11న నిర్వహించిన ఇండియా డే పెరెడ్ లో చికాగో ఆంధ్ర సంఘం (సిఎఎ) పాల్గొనడంతోపాటు శకటాన్ని కూడా ప్రదర్శించి అందరి ప్రశంసలను అందుకుంది. వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం అందరినీ చాలా ఆనందపరిచింది. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి సహకారంతో సిఎఎ బృందం ఈ వేడుకల్లో పాల్గొన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల సంస్కృతిని తెలియజేస్తూ ఒక ట్రక్కును తెలుగు తల్లి మరియు నందీశ్వరుల తో బోస్ కొత్తపల్లి, ఆశ్రిత్ కొత్తపల్లి, హరిణీ మేడ, శృతి కూచంపూడి, శ్రీనివాస్ పద్యాల, శ్రీ వాసవీ తెంకుమల్ల, నవీన్ కుమార్ తెంకుమల్ల మున్నగు వారు చాలా అందంగా అలంకరించి ప్రదర్శించారు.
చికాగో ఆంధ్ర సంఘ మహిళలు అమరావతీ నగరం కూర్చిన చక్కటి గీతానికి శ్వేత కొత్తపల్లి, శరణ్యా నక్క, మాలతి దామరాజు, శ్రీ వాసవీ తెంకుమల్ల, శిరీశ పద్యాల, అనూష బెస్త, లాస్య మంగిపూడి, శిరీష వీరపనేని, శ్రీ స్మిత నండూరి, శైలజ సప్ప, హరిణి మేడ, సౌజన్యా దేవరపల్లి, రాధిక గరిమెళ్ళ, సత్యవాణి ప్రెక్కి, ఉమ కొత్తమాసు, తేజస్వి శరణ మున్నగు వారు కోలాట నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. దేశభక్తి పాటలతో, నృత్యాలతో పిల్లలు పెద్దలు ప్రేక్షకులని అలరించారు. ఇటీవల మన దేశం గర్వించిన %ు20 జతీఱషసవ్ ఔశీతీశ్రీస జబజూ% విజయాన్ని సభ్యులు పురస్కరించుకొని చికాగో ఆంధ్ర సంఘం స్పోర్ట్స్ విభాగం గణేశ్ చుండూరు, కార్తిక్ చుండూరు, అభిరామ్ నండూరి, అవినాష్ నండూరి, భారత్ క్రికెట్ జట్టును ప్రశంసించారు. సంఘ బోర్డు సభ్యులు, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, లక్ష్మి నాగ్ సూరిభొట్ల, హేమంత్ తలపనేని, గీతిక మండల, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల మరియు ట్రస్టీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.







