ATA: ఫీనిక్స్ లో ఘనంగా ఆటా మహిళా దినోత్సవం
అమెరికా తెలుగుసంఘం(ఆటా) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను వివిధ నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ఫీనిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో 4వ ఆటా వార్షిక మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల నుంచి 200కు పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఐక్యత, స్నేహం, సాధికారతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. సంగీతం, నృత్య ప్రదర్శనలు, వినోదాత్మక ఆటలు ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ జీవిత అనుభవాలను, స్ఫూర్తిదాయకమైన కథలను అతిథులతో పంచుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డిలు ఫీనిక్స్ ఆటా విభాగ సభ్యులకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు.

ఇవి కూడా చదవండి









