ATA: ఓర్లాండోలో ఆటా స్టెమ్ సెల్ డ్రైవ్ విజయవంతం
ఓర్లాండోలో అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ప్రకటన వెలువడిన 2 రోజుల్లోనే పలువురు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లోనే అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అసోసియేషన్ (ఆపి) సహకారంతో, భారతీయ యువతకు మెరుగైన భవిష్యత్తు కోసం అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులచే స్టెమ్ సెల్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ వేడుకలకు గౌరవ అతిథిగా వచ్చిన మహిళానాయకులు తమ సేవలను, ఇతర కార్యక్రమాలను వచ్చినవారికి వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఓర్లాండోలోని యువ ప్రతిభావంతులైన గాయకులతో మరియు ఓర్లాండో ఘంటసాల డా. బుచ్చిరెడ్డి గారితో కొనసాగాయి. ఆ తర్వాత బింగో ఆటలు మరియు తల్లుల కోసం రాఫెల్ బహుమతులు నిర్వహించారు.
తల్లిదండ్రులు-పిల్లల నృత్యం, లేక్ నోనా ఇండియన్స్ నృత్య ప్రదర్శన, శాస్త్రీయ నృత్య ప్రదర్శన మరియు తెలుగు మెడ్లీ డ్యాన్స్ వంటి అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ప్రాంతీయ డైరెక్టర్ డా. నీలిమ కటుకూరి, ఈవెంట్ నిర్వాహకులకు, ప్రశాంతి రెడ్డి, సుహాసిని కోసనం, డా. బుచ్చిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఆటా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను, ముఖ్యంగా ఆటా చేస్తున్న సేవలను కూడా హైలైట్ చేశారు, ఆటా కుటుంబంలో సభ్యులుగా చేరడానికి హాజరైన వారిని ప్రోత్సహించారు.
ఈవెంట్ స్పాన్సర్‌లు: డా. బుచ్చిరెడ్డి మరియు నిర్మల, జయంత్ చల్లా, డా. వినయ్ మరియు నీలిమ కటూకూరి, డా. గోపాల్ మరియు సుకన్య కుంట, శోభా మరియు జలంధర్ ఎలిగేటి మరియు మధురిమ పాతుర్ ఈ వేడుకలు విజయవంతమయ్యేలా కృషి చేశారు.







