ATA: ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు
- జ్ఞానపీఠ గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విశ్లేషణ
- ఉత్సాహంగా పాల్గొన్న సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు
- జయహో తెలుగు సాహిత్యం అంటూ కొనియాడిన ఆటా ప్రతినిధులు
- తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది
- ఆటా అంతర్జాతీయ సదస్సులో పలువురు వక్తలు
హైదరాబాద్: తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకొని జాతి గొప్పతనాన్ని నిలుపుకోవాలని ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకల్లో భాగంగా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాహిత్య సదస్సు – 2025, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల సాహిత్య సమాలోచన పేరుతో నిర్వహించిన సదస్సును తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకూబ్ ప్రారంభించగా, ఆటా సాహిత్య వేదిక చైర్ వేణు నక్షత్రం సభ అధ్యక్షత వహించగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకూబ్, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ లు మాట్లాడుతూ…. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాస పత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ… తెలుగు పై వారికి వున్న ప్రేమకి నిదర్శనం అని అన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత ఆటాదేనని అన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉందన్నారు. జ్ఞానపీఠ పురస్కారాలలో మన తెలుగు వెలుగులు అనే అంశంపై ఆచార్య, కళా ప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్, మధ్యతరగతి జీవన విధానానికి ప్రతీకలు వినోద్ కుమార్ శుక్లా నవలలు అనే అంశంపై డాక్టర్ పిరిసెట్టి శ్రీనివాసరావు, శుక్ల రచనల్లో ప్రకృతి చిత్రీకరణ అనే అంశంపై డాక్టర్ ఆర్ సుమన్ లత, శుక్ల నవలల్లో జీవన దృష్టి అనే విషయంపై ప్రొఫెసర్ సర్రాజ్, శుక్లా నవలల్లో మధ్య తరగతి జీవితం అనే అంశంపై శ్రీనివాస్ గౌడ్, శుక్ల కవిత్వం వాస్తవికత పై రూప్ కుమార్ డబ్బికార్, శుక్ల సాధారణత లోని కవితాత్మకత పై ఆనంద్ వారాల, శుక్ల సినిమా సాహిత్యం పై రెంటాల జయదేవ్ తదితరులు వారి అభిప్రాయాలను తెలియచేశారు. ఆయా సదస్సులను ప్రసేన్, సంపత్ కుమార్ బెల్లంకొండ అధ్యక్షతన నిర్వహించారు
ముగింపు వేడుకలు
ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలను రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డిలు నిర్వహించగా ఆట బోర్డు సభ్యులు ఆట ఇండియా టీం సభ్యులను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ… ఆటాకు సహకరిస్తున్న సాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సాహిత్య సదస్సును ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, ఆటా సాహిత్యానికి మంచి ప్రాముఖ్యత కల్పిస్తుందని, అందుకే సాహితీవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి ముందుండి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సూర్యచంద్ర రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, సాహితీ ప్రియులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






