ఆటా మెగా కన్వెన్షన్ దిశగా జోరుగా సన్నాహాలు.. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన కార్యక్రమాలు
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో నిర్వహించనున్న మహాసభల కోసం సన్నాహక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. గత వారాంతంలో అమెరికాలోని పలు నగరాల్లో క్రీడలు, వ్యాపార సెమినార్లు , నిధుల సేకరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
వివరాలు..
నిధుల సేకరణ..
ఏప్రిల్ 24న డల్లాస్‌లో నిర్వహించిన కాన్ఫరెన్స్ కిక్ఆఫ్ , ఫండ్‌రైజింగ్ ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది. ఇందులో రికార్డు స్థాయిలో నిధులు సేకరించారు.

క్రీడా పోటీలు..
వర్జీనియాలో గోల్ఫ్ టోర్నమెంట్ ప్రణాళికా సమావేశం, వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా (DMV)లో 200 మందితో బ్యాడ్మింటన్ పోటీలు, డెలావేర్లో 100 మందికి పైగా పాల్గొన్న టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. పెన్సిల్వేనియాలో జరిగిన చెస్ టోర్నమెంట్లో 60 మందికి పైగా చిన్నారులు తమ ప్రతిభను చాటారు. సౌత్ కరోలినాలోని గ్రీన్ విల్లేలో తొలిసారిగా నిర్వహించిన బిజినెస్ సెమినార్‌కు 100 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇందులో హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ , ఇతర పెట్టుబడి రంగాలపై చర్చించారు.
ఈ కార్యక్రమాలన్నీ బాల్టిమోర్ కాన్ఫరెన్స్‌పై తెలుగు వారిలో భారీ అంచనాలను పెంచాయని, వాలంటీర్లు , దాతల సహకారం అభినందనీయమని ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








