నిర్వాణం- భౌతికమైన స్త్రీకి, అధిభౌతికమైన మృత్యువుకు పోరాటం
పన్నెండునెలల సంసారం పూర్తయిన తర్వాత నారద మహర్షి చెప్పిన గడువు పూర్తయి సత్యవంతుడు మరణించే రోజు. దుర్గాదేవిని అర్చించిన తర్వాత సావిత్రి అత్తగారి దగ్గరకు వచ్చి తాను సత్యవంతునితో కలిసి, అరణ్యానికి వెళ్లడానికై అనుమతి కోరింది. సావిత్రికి రానున్న ఉపద్రవం తెలుసు, దానిని ఎలాగైన తప్పించాలన్నకోరిక. విధివాత పడనున్న భర్తతో బయలుదేరింది. చెట్లను నరుకుతూ అలసిన సత్యవంతుడు సావిత్రి ఒడిలో తలపెట్టి విశ్రమించాడు. అలసి, స్పృహ తప్పిన సత్యవంతుడి ముఖం క్షణంలో కళతప్పింది. కళ్ళుకాంతి హీనాలైనాయి. మృత్యువు సత్యవంతుని కబళించేసింది.
సత్యవంతుడు అచేతనంగా పడివున్నాడు. ఇంతకాలం శరీరంలో శరీరంగా, ఆత్మలో ఆత్మగా కలసి ఒకే ప్రాణంగా, ఒకే సంకల్పంగా భాసిస్తూ రోజులన్నీ తమవిగా చేసుకుని తిరిగారు, ప్రేమైక జీవులుగా కలిసిపోయారు. భూమ్యాకాశాలవలె వారిది విడరాని దాంపత్యం. ఒకప్పుడు ఇద్దరూ ఆనందంతో భూమికి స్వర్గానికి వారధికట్టారు.
So, she was left alone in the huge wood,
Surrounded by a dim unthinking world,
Her husband’s corpse on her forsaken breast.
In her vast silent spirit motionless
She measured not her loss with helpless thoughts,
Nor rent with tears the marble seals of pain:
She rose not yet to face the dreadful god.
Over the body she loved her soul leaned out
In a great stillness without stir or voice,
As if her mind had died with Satyavan.
ఇప్పుడు ఒక్కసారిగా గుండె అఖాతమైంది. జీవితంలో ఆనందానికి మంగళం పలికినట్లయింది సావిత్రి పరిస్థితి. జీవితంలో సుఖానికి, ఆనందానికి ఆఖరి మజిలీలా తోచింది. శూన్యానికి ఆహ్వానం పలికిసట్లు, చీకటికి స్వాగతం చెప్పినట్లుంది ఆమె. అన్ని శూన్యాలను మించిన శూన్యత ఆవరించింది సావిత్రిలో. ఆమె మూగబోయిన కల్లోల హృదయానికి భాష కరువైంది. ఈ ప్రపంచం, జీవితం అంతా అవాస్తవం అనిపించింది.
సత్యవంతుని ప్రక్కన కూర్చున్న సావిత్రికి తనదికాని ‘వాణి’ వినిపించింది. తాను పొందవలసింది విశ్వచైతన్యమని ఆ అశరీరవాణి సావిత్రికి గుర్తుచేసింది. సావిత్రి తనను తాను తెలుసుకోపూనుకుంది, తన ఆత్మను అన్వేషించపూనుకున్నది. భూలోకం అంటే భౌతికలోకం కాని అంతర్లోకం వేరు, అది ఆత్మలోకం. అక్కడికి వెళ్లాలంటే వాతావరణాన్ని, రోదసి పొరల్ని దాటి వెళ్ళాలి, అంటే నిర్గుణస్థితి పొందాలి. అంటే కాలానికి, దూరానికి, విధికి అతీతమైన మహాచైతన్యం పొందాలి అదే ఆమె సంకల్పం.
త్వమేవాహం
ఈ ప్రాపంచిక మాయ తొలగిపోయింది. అవాస్తవం కరిగిపోయి ‘సత్యం’ గోచరమైంది. శూన్యంకన్నా బలమైనది సత్యం. భావం కన్నా బలవత్తరమైనది తన ఆత్మ. తన ఆత్మే విశ్వాత్మ. “త్వమేవాహం” అనుకోగలిగిన స్థితి. ఆమెకు లోకమే పరమాత్మ స్వరూపంగా కనిపించిసాగింది. అన్నీతానే అన్న అనుభూతి పొందింది. అది ఆత్మదర్శనం. పరిశుద్ధమైన ఆత్మదృష్టి ఒక్కటే తన బలం అని నమ్మింది.
It was herself, it was the self of all,
It was the reality of existing things,
It was the consciousness of all that lived
And felt and saw; it was Timelessness and Time,
It was the Bliss of formless and form.
ఆమె హృదయం అన్ని ఆత్మలకు ఆలంబనమైన
ఒక మహాశూన్యం, విశ్వంలో జరిగే అనేకమైన
సంఘటనలకు ఆధారం, అదే ఆలోచనలకు బీజం
అదే పరమాత్మ సంకేతమైన మహాశూన్యం
జీవుని పూర్ణత్వానికి చిహ్నమైన పూర్ణవలయం
అది ఆమె మాటలలో చేష్టలలో సువ్యక్తమవుతుంది.
పరమాత్మకు ప్రతినిధి అయిన వ్యక్తి మహాపురుషుడైనా కావాలి, శూన్యహృదయుడైనా కావాలి. స్వతహాగా సావిత్రి అసమాన ప్రతిభాశీలి. ఆశ్రమాలలోని తపోనిధుల సమక్షంలో సందేహాలకు ఆమె ఇచ్చే సమాధానాలు మానవాతీతం అనిపిస్తాయి. అవి అత్యంత నిగూఢాలు, మార్మికాలు, అసమాన్యాలు. ఆమె నోటి నుండి వెలువడేవన్నీ అద్భుత సత్యాలు. అనూహ్యమైన విజ్ఞానం ఆమెనుండి వెలువడేది.
ఆమె చూపిన జ్ఞానదీప్తులకు అబ్బురపడి
పరమాత్మ విన్నూత్న సత్యాన్ని ఆమోదించి
తాము ఎన్నటికో, ఎప్పటికోగాని దర్శించలేని
తెలుసుకోలేని సత్యాలను ఆమెనుండి గ్రహించారు.
విశ్వవ్యాప్తమైన పరచైతన్యాన్ని శ్రీ శార్వరి ఈ రకంగా వర్ణిస్తారు.
చెట్టులో, ఆకులో, పూవులలో వుండే చైతన్యం తానే
పూవులలో, పిందెలలో దాగిన మకరందం మాధుర్యాలు తానే
గులాబీల సౌకుమార్యం, సౌందర్యం తానే.
వలపు హృదయాల పరిమళించే ప్రేమకుసుమం తానే
నిర్మల సరోవరంలో వికసించిన అరవిందమూ తానే.
మృత్యువు
ఆ మహోదయ ప్రాభాత సువర్ణరోచిస్సులతో
ఇంకా నిద్రస్తున్న ప్రాణవిభుని ప్రక్కన పరుండి
మరణించబోతున్న వ్యక్తి వెనుతిరిగి తన
జీవన తేజోసీమలలోకి తొంగిచూచినట్లు
ఆమె గతంలోకి చూచింది, అతను అందరివలె
ఆనందాలను అనుభవించాడు, సుఖంగా జీవించాడు.
తన ఒడిలో ఇంకా విశ్రమిస్తున్న సత్యవంతుని మృతదేహాన్ని నెమ్మదిగా నేలపై ఉంచి ఒంటరిగా మృత్యుదేవతను ఎదుర్కొన సిద్ధమైంది. మహారణ్యంలో ఒంటరిగా, చుట్టూ అంధకార ప్రపంచం. శూన్యమైన ఆమె హృదయంలో భర్త మృతశరీర స్మృతి. తన నష్టాన్ని గురించి నిష్ప్రయోజనంగా ఆలోచించలేదు. కరడుగట్టిన వేదనను కన్నీటితో కడగలేదు. భయంకర మృత్యుదేవతను సైతం నిందించలేదు.
సావిత్రి భూమిపై జన్మించినా, అన్ని భువనాలలో సంచరించగలదు. అందుకే సావిత్రి తన భౌతికకాయాన్ని అరణ్యంలోనే వదిలి ఆత్మ శరీరంతో సత్యవంతుడిని వెంబడించసాగింది. ఇప్పుడు ఆమె కేవలం సావిత్రి కాదు. ఒక మహాసంకల్పంతో, సత్యవంతుని రక్షించుకోవడం ఒక్కటే ఆమె పరమలక్ష్యం. తాను నిర్వహించవలసిన మహత్కార్యానికి దివ్యసంకల్చం, స్వతంత్ర శక్తి అవసరం. అందుకే మృత్యుదేవతను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పరలోకాలలోకి అడుగుపెట్టింది. యముని హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా మానవుడుకి నిషిద్ధమైన లోకాల్లోకి వెంబడించింది. “పృకృతి ధర్మానికి కట్టుబడి, పట్టుదల వదిలి పెట్టి వెనుతిరుగు. నా శాశనాన్ని అనవసరంగా ప్రతిఘటించకు” అన్న కాలుని బెదిరింపులకు సావిత్రి కదలలేదు, మెదలలేదు.
యముని బోధ: ఈ నీ అనురాగబంధాన్ని శాశ్వతం చేసుకోగలవా సావిత్రి. సత్యవంతుని వలె నీవూ ఒకనాటికి మరణించవలసిందే. అతనికి మృత్యువు ప్రసాదించిన ఆత్మశాంతిని ఎందుకు కాదంటావు! పట్టువిడిచి పెట్టు. అతనిది, నీది అయిన శరీరం భౌతికం. ఇప్పుడతని ఆత్మ మహాశక్తికి చెందింది. ఓ మానవీ! నీ భర్త మరణించక తప్పదు.
సావిత్రికి తన లక్ష్యం ఏదో తనకు తెలుసు. తన ఆత్మ ఏ మహోన్నత ప్రయోజనం కొరకు నిర్దేశింపబడిందో ఆమెకు తెలుసు. పర్వత శిఖరంపైన, ఒంటరి కాపలావాని వలె నిలబడి, ఆమె ఆత్మ ప్రశాంతంగా వెలుగురెక్కలు కట్టుకొని గగన విహారం చేసింది.
యమునితో నడక, ఈ లోకాన్ని దాటి భయంకరమైన నిశ్శబ్దసీమల్ని చేరుకున్నారు. తొలుత మహాంధకార అరణ్యాలలో పయనించారు. కంటికి కనిపించని మహాపథంలో ప్రయాణం. సమాధ్యవస్ధలో మాత్రమే చేరుకోదగిన తావులు. మహోదత్త నిరామయ స్వాప్నిక స్థితి అది.
తేజోరూపంతో సత్యవంతుని ఆత్మ, దాన్ని వెన్నంటి మృత్యువు నీడలా, ఆ వెనుక సావిత్రి. తేజోలోకాలలో పయనిస్తున్న సావిత్రికి, తన లక్ష్యం, ఆనందం, మూలం అన్నీ ఒక్క సత్యవంతుడే. ఆత్మలోకాలలో ముగ్గురూ ముందుకు పోతున్నారు, అంతా స్వప్నభ్రాంతి.
మృత్యువు ప్రళయభీకరంగా అరిచింది.
“ఓ మనిషీ! తిరిగి నీ మర్త్యలోకానికి మరలిపో! మృత్యువుని వెన్నంటి మృత్యువాసానికి రావద్దు. కాలం తీరిన తరువాత ప్రాణంతో వుండడం జరగదు. నీ మనస్సు కల్పించుకున్న ప్రేమలు దివ్యం అనుకోకు. నీ ఆత్మను భౌతికస్థాయి నుండి పైకి తీసుకురాలేవు. భౌతికమైన గూడును ఛేదించడం ఎలా సాధ్యం. నిరాధారమైన శూన్యంలో నీ పాదాలను మోపలేవు. పధరహితమైన అనంతంలో నీవు పయనించలేవు.
సావిత్రి విధికి ప్రతికూలంగా, ధర్మాన్ని ధిక్కరిస్తూ, స్వసంకల్పమే శక్తిగా, గంభీరంగా నిలబడ్డది. ఆమె భూమిపైన నిలచిన శిలామూర్తిలా వుంది. నిశబ్దంలో ఏకాంతంగా, అనంతంలో ఒంటరిగా, అర్ధరాత్రి భయంకర చీకట్లలో ధైర్యంగా, అగ్నిశిఖ వలె, తేజస్విని వలె ఆమె నిలచింది.
కాళరాత్రి
ఆ కాళరాత్రి మృత్యులోకం చేరినా సావిత్రి వెనుదిరిగలేదు. యముడు ఆమె సంకల్పానికి మెచ్చి ద్యుమత్సేనునికి చూపునిచ్చాడు, సకల సంపదలు, సుఖాలు ఇచ్చాడు. పోయిన రాజ్యాన్ని తిరిగి అనుగ్రహించాడు. సావిత్రి జీవన్మరణ సూత్రాలను అతిక్రమించకుండా, వెనుతిరిగి పోతుందని భావించాడు యముడు కానీ సావిత్రి అలా వెనుదిరగలేదు. మానవజన్మ ఎత్తినా ఆమె విధిని, కర్మను ఎదిరించగల శక్తికలది. ఒకరకంగా ఆమె మృత్యుంజయురాలు. తనతో సత్యవంతుడు కూడా భూలోకంలోకి వస్తేనే తాను వెళ్లేది, అదే చెప్పింది. యముడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. మరో హెచ్చరిక చేశాడు.
“పుట్టుకతోనే మరణమూ నిర్ణయింపబడుతుంది. లోకాలను లయించేది మృత్యువు. లోకాలన్నీ మృత్యువు చేతిలో ఆటబొమ్మలే. మనిషిని స్వర్గనరకాలు ఏవీ రక్షించవు”.
అయినా సావిత్రి భయపడలేదు, చలించలేదు. ఆమెకు తెలుసు భగవంతుడు “మృత్యువు” కాదు, పరమాత్మ ప్రేమకు, ఇచ్ఛకు మూలం. అందుకే యముడి ఆజ్ఞలను ధిక్కరించింది, ఆక్షేపణల్ని విస్మరించింది.
Awhile on the chill dreadful edge of Night
All stood as if a world were doomed to die
And waited on the eternal silence, brink.
Heaven leaned towards them like a cloudy brow
Of menace through the dim and voiceless hush.
భయద శీతల నీరవ నిశబ్ద నిశీధ తుది అంచుకు చేరి ఒక్కసారిగా విశ్వం ప్రళయంలో నశించబోతున్నట్లు విహ్వలంగా మువ్వురూ నిలబడి ఎదురు చూడసాగారు. ఆ భయంకర నిశ్శబ్దాన్ని, చీకటిని చీల్చుకుని, ఒక వెలుగు కిరణం స్వర్గం నుండి, మేఘాల చాటున తొంగిచూచింది.
యముడు: అద్భుతమైన నా కఠోర లోకాలనుండి వెళ్ళపో
వెంటనే వెళ్లకపోతే, నీవూ నా మృత్యువాత పడతావు
దైవనిర్ణయాన్ని ఇప్పటికే నీవు ధిక్కరించావు.
సావిత్రి: సత్యవంతుడి ఆత్మను తీసుకెళ్ళే తావులకు నేనూ వస్తాను. నాశనం చేయడానికే అయితే ఈ లోకాన్ని సృష్టించడం ఎందుకు?
అచంచలమైనది, అనంతమైనది కాలపురుషుని సంకల్పం.
అతనికి తన శక్తి తెలుసు, తన లోకం తెలుసు
మృత్యువాత పడే ఒక వ్యక్తి నిస్సహాయంగా
పలికిన మాటలకు మృత్యువు సమాధానం చెప్పదు.
మహాంధకారంలో, మహానిశబ్ధంలో, నిశ్చల
మూర్తిలా, అస్పష్టమైన ఛాయలా నిలిచి
తన నిగూఢ కరవాలంతో మెరుపులు చిందిస్తాడు.
అనూహ్యమైన అంధకారంలోకి పరిష్కారం దొరకక ముగ్గురూ కదిలారు.
అరవిందుని సావిత్రిలో 49 అధ్యాయాలలో 38 సృష్టి, తపస్సు, యోగం లాంటి వివరణలే విస్తృతంగా వుంటాయి. సావిత్రిసత్యవంతుల కథ మాత్రం మందగమనంతో సాగుతుంది. అరవిందులు- శార్వరి తమ అపారమైన యోగానుభవాలు, ఆత్మదర్శనాలు ఈ కథకి ముడిపెట్టి చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి రచన, విధానం హృద్యంగా ఉంటుంది. ఇక ఈ పుస్తకంలో కూడా మిగిలిన భాగాల్లో లాగానే చదువుతున్నప్పుడు ఆద్యంతం ఆణిముత్యాల్లాంటి వాక్యాలు కోకొల్లలు కనిపిస్తాయి. మచ్చుక్కి కొన్ని
భావాతీతస్థితికి చేరినా సావిత్రికి ఈ లోకం స్ఫురణ పోవడం లేదు (యోగసాధన తొలిదశలో సాధకుడి అనుభవం).
పరమాత్మ కాలానికి, దూరానికి అందనంత దూరంగా, అతీతంగా ఉంటుంది.
సత్యం రూపంలో, ఆకారంలో, రేఖలో, రీతిలో నిబద్ధం కాదు.
ఆత్మగతమైనది ఆధారరహితం.
శాశ్వతమైనదొక్కటే సత్యం, వాస్తవం.
కనిపించేవన్నీ యదార్థాలు కావు. ఎప్పటికీ రూపుదాల్చనివే అసలైన యదార్థాలు.
అనేకత్వంలో ఏకత్వం. అదే ఏకైక అనంతం- అనంతతత్వానికి ప్రతీక.
సత్యం ముందర జ్ఞానం, జ్ఞాతం, జ్ఞాని, అన్నీ నిరర్థకాలే.
మనది అనుకున్నది ఏది మన సొంతం కాదు. మనలో చలించే శక్తి సైతం మనది కాదు. మన ప్రజ్ఞ సైతం పైనుండి దిగి రావాల్సిందే. ప్రజ్ఞ, ప్రాభవం, రూపం, ఆకర్షణ, కీర్తి, దీప్తి, ఇలా అన్ని ఒక మహాగ్నిగుండం నుండి వెలువడే రోచస్సులే. భగవంతుని కర్మశాల నుండి వెలువడే నమూనాలపైన, భూమిపైన సర్వాధికారాలు, హక్కులు పరమాత్మవే.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Drive South
Cordova, Tennessee 38018, USA
ramanavvasili@hotmail.com
Cell: 901-387-9646








