ఏక్ దిన్ విషయంలో అలా ఫీలవుతున్న సాయి పల్లవి
సౌత్ లో నేచురల్ యాక్టింగ్ కు అడ్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి(Sai Pallavi) సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, తనకు నచ్చిన కథలు మాత్రమే చేస్తూ వచ్చిన ఆమె ఇటీవల బాలీవుడ్లో ఏక్ దిన్(Ek Din) సినిమాతో అడుగుపెట్టింది. ఆమిర్ ఖాన్(Aamir Khan) నిర్మాణంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో జునైద్ ఖాన్ హీరోగా నటించగా, ప్రేక్షకుల నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. రిలీజైన మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే సినిమా రిజల్ట్ తో పాటు సాయి పల్లవి ఎంపికపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఏక్ దిన్‌కు నేను సరైన ఎంపిక కాదనిపించిందని, ఈ పాత్రకు కొత్త అమ్మాయి అయితే బాగుండేదని, కొంచెం ఫ్లాంబోయెన్స్ ఉన్న నటికి ఆ పాత్ర మరింత సూటయ్యేదంటూ ఆమె స్పష్టంగా చెప్పిందని, ఇప్పటివరకు ఎక్కువగా ఎమోషనల్, ఇంటెన్స్ పాత్రలు చేసిన తాను, కొంచెం లైట్ జానర్ ప్రయత్నించాలని భావించి ఈ సినిమా ఒప్పుకున్నానని తెలిపింది.
అంతేకాకుండా, ఈ సినిమా బిఫోర్ సన్‌రైజ్ తరహా ఫీల్‌తో సాగుతుందని భావించానని సాయి పల్లవి వెల్లడించింది. అయితే తెరపై ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదని ఆమె అంగీకరించడం విశేషం. డైరెక్టర్ సునీల్ పాండే(Sunil Pandey) తెరకెక్కించిన ఎక్ దిన్ 2016లో వచ్చిన థాయ్ చిత్రం వన్ డే(One Day)కు రీమేక్‌గా రూపొందింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కంటెంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్లో మరో నిరాశాజనక ఫలితంగా మిగిలిపోయింది.








