లారెన్స్ మూడు కోట్ల విరాళం
కరోనా బాధితులను ఆదుకోవడం కోసం తన వంతుగా 3 కోట్లు ఇస్తున్నట్లు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించి తన పెద్ద మనసు చాటుకొన్నారు. ఇందులో రూ.50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, మరో రూ.50 లక్షలు చలనచిత్ర కార్మిక సమాఖ్యకు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే నృత్య దర్శకుల సంఘానికి కూడా రూ.50 లక్షలు, తన దగ్గరున్న దివ్వాంగుల కోసం రూ.25 లక్షలు ఇస్తానని రాఘవ లారెన్స్ వెల్లడించారు. తన పుట్టిన ఊరి రాయపురంలోని పేద ప్రజానీకం కోసం రూ.75 లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.













