Priyanka Jawalkar: ప్రమోషన్స్ కు పిలవలేదని హీరోయిన్ కంప్లైంట్

ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. ప్రమోషన్స్ సరిగా చేయకపోతే వచ్చే నష్టం చాలా ఎక్కువ. సరిగా ప్రమోషన్స్ చేసి సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లకపోతే ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై పడుతుంది. అందుకే ఈ విషయాన్ని గ్రహించిన మేకర్స్ రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తున్నారు.
ప్రమోషన్స్ ఎంత కీలమైనా సరే కొంతమంది మాత్రం అసలు వాటి జోలికి రాకుండా ఉంటారు. స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రమోషన్స్ కు మాత్రం దూరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తనను అసలు ప్రమోషన్స్ కు పిలవలేదని ఓ హీరోయిన్ కంప్లైంట్ చేస్తుంది. ట్యాక్సీవాలా(Taxiwala) హీరోయిన్ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తో చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం(SR Kalyana Mandapam) సినిమా ప్రమోషన్స్ లో అసలు పాల్గొనలేదు.
దానికి కారణం తనను ఎవరూ ప్రమోషన్స్ కు పిలవకపోవడమేనని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక వెల్లడించింది. ఆల్రెడీ సాంగ్స్, టీజర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది కదా అందుకే ప్రమోషన్స్ అవసరం లేదేమో అనుకున్నానని, తనను ప్రమోషన్స్ కు పిలిస్తే వెళ్లే దాన్నని కానీ ఎవరూ తనను పిలవలేదని, సినిమా హిట్ అయ్యాక అప్పుడు పిలిచారని ప్రియాంక తెలిపింది.