Payal Rajputh: బ్లూ డ్రెస్ లో ఎట్రాక్ట్ చేస్తున్న ఆరెక్స్100 బ్యూటీ
ఆరెక్స్ 100(RX100) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్పుత్(Payal Rajputh) ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత పాయల్ కు వరుస అవకాశాలైతే వచ్చాయి కానీ స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. మొన్నామధ్య మంగళవారం(Mangalavaram) అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నప్పటికీ అది కూడా పాయల్ కు పెద్దగా కలిసిరాలేదు. ఓ వైపు పంజాబీ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సౌత్ లో స్టార్ హీరోయిన్ అవాలని ప్రయత్నిస్తున్న పాయల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను నెట్టింట అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా పాయల్ బ్లూ కలర్ టాప్, బిస్కెట్ కలర్ బాటమ్ తో అదిరిపోయే పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో అమ్మడు డీసెంట్ గా కనిపిస్తూ అందరి దృష్టిని మరింత ఎట్రాక్ట్ చేస్తోంది.






