NTR: దేవర జపాన్ ప్రమోషన్స్ కు రెడీ అయిన తారక్
ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన దేవర(Devara) మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందించాడు. గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ మూవీ రాజమౌళి(Rajamouli) సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసి సూపర్‌హిట్ గా నిలిచింది.
అయితే ఈ మూవీ ఇప్పుడు మార్చి 28న జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగి దేవర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు. జపాన్ మీడియాకు ఎన్టీఆర్ స్పెషల్ గా ఆన్లైన్ ఇంటర్వ్యూలిస్తున్నాడు. టాలీవుడ్ మూవీస్‌కు జపాన్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు జపాన్ లో రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యాయి.
గతంలో ఆర్ఆర్ఆర్(RRR) తో పాటూ పలు సినిమాలు జపాన్ లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు జపాన్ లో టాప్1లో ఆర్ఆర్ఆర్ నిలవగా, ఆ తర్వాత ముత్తు(Muthu), బాహుబలి2(Baahubali2), త్రి ఇడియట్స్(3 Idiots) ఉన్నాయి. ఇప్పుడు దేవరకు సరిగా ప్రమోషన్స్ చేసి దీన్ని కూడా టాప్ లో నిలపాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే నెల రోజుల ముందు నుంచే ఎన్టీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. దీని కోసమే ఎన్టీఆర్ వచ్చే నెల 22న జపాన్ వెళ్లనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.













