Nithin: వెంకీ బాటలో నితిన్
ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. అందుకే ప్రతీ ఒక్కరూ ప్రమోషన్స్ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ కొత్తదనం కోరుకోవడంతో సినిమాను ప్రమోట్ చేయడం మేకర్స్ కు పెద్ద సవాల్ గా మారింది. కానీ సినిమా ఓపెనింగ్స్ లో ప్రమోషన్స్ కీలకపాత్ర పోషించడంతో ప్రతీ ఒక్కరూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు.
రీసెంట్ గా సీనియర్ హీరో వెంకటేష్(Venkatesh) సైతం ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)తో భారీ హిట్ ను అందుకున్నాడు. ఆ సినిమా కేవలం ప్రమోషన్స్ వల్లే ఆ స్థాయి హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వెంకీని చూసి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) కూడా అదే బాటలో వెళ్తున్నాడు. మామూలుగా చాలా రిజర్డ్వ్ గా ఉండే నితిన్ రాబిన్‌హుడ్(Robinhood) ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు.
తన కెరీర్లో ఎప్పుడూ లేనిది కాలేజ్ టూర్లు, మాల్స్, వేరే వేరే ఊర్లు తిరిగి మరీ రాబిన్‌హుడ్ ను ప్రమోట్ చేస్తున్నాడు నితిన్. అంతేకాదు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి స్టేజ్ పై డ్యాన్సులు కూడా వేస్తున్నాడు నితిన్. దాంతో పాటూ వెంకీలానే నితిన్ కూడా మూవీ టీమ్ తో కలిసి ఫన్నీ పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ ప్రమోషన్స్ ద్వారా మంచి ఫన్ అందిస్తున్నాడు. మరి వెంకీని ఫాలో అవుతున్న నితిన్ కు అతనిలానే హిట్ దక్కుతుందేమో చూడాలి.













