కొత్త డైరెక్టర్ తో నారా రోహిత్ నెక్ట్స్!
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన కథల ఎంపికతో గుర్తింపు పొందిన నారా రోహిత్(Nara Rohit) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల సుందరకాండ సినిమాతో ఫన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు #RN23 పేరుతో తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న నారా రోహిత్, ఈ సారి పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాకు చినిమిల్లి మణికుమార్(Chinimilli Manikumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయనకు డైరెక్టర్ గా తొలి ప్రయత్నం కావడం విశేషం. కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే అందించగా, ఫ్రెష్ కంటెంట్‌తో సినిమా రూపొందుతోందని చిత్ర బృందం చెబుతోంది. కరణ్ సి ప్రొడక్షన్స్ LLP(Karan C Productions LLP) బ్యానర్‌పై భరత్ చౌదరి(Bharath Chowdary) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న ఐదో ప్రొడక్షన్‌గా ఈ సినిమా ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త డైరెక్టర్, వినూత్న కథ, టాలెంటెడ్ హీరో కలయికపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.
ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో Shouting Soon అనే ట్యాగ్‌లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాస్యం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని మేకర్స్ తెలిపారు. త్వరలో ఘనంగా ముహూర్తం కార్యక్రమాన్ని నిర్వహించి, నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలను వెల్లడించనున్నారు. మొత్తానికి #RN23 ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే పాజిటివ్ బజ్ నెలకొని, ఇది నారా రోహిత్ కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.








