Manasa Varanasi: ఫ్లోరల్ శారీలో మరింత గ్రేస్‌ఫుల్ గా మానస వారణాసి
మిస్ ఇండియా టైటిల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మానస వారణాసి(manasa varanasi) రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ(Couple friendly) మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే.

ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మానస మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మానస తన సొగసైన స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ అర్చన జాజు(Archana jaju) రూపొందించిన ఫ్లోరల్ మోటిఫ్స్ తో డిజైన్ చేసిన శారీలో సంప్రదాయం, ఆధునికత రెండింటినీ సమన్వయపరుస్తూ కనిపించింది.

చీరలో మాజీ మిస్ ఇండియా మరింత అందంగా ఉందని ఆమె ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.









