Devara2: దేవర2కు రంగం సిద్ధం చేస్తున్న కొరటాల
టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొల్పిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర రెండో భాగంపై తాజాగా ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. జూ. ఎన్టీఆర్(jr. NTR) హీరోగా, కొరటాల శివ(koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా మొదటి భాగం విడుదలకు ముందే సీక్వెల్‌పై చర్చలు మొదలయ్యాయి. మొదటి సినిమా రిజల్ట్ చూశాక దేవర2(devara2) ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ దేవర2 తప్పకుండా ఉంటుందని స్వయంగా ఎన్టీఆర్, నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో తారక్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే కొరటాల శివ(koratala Siva) రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను వేగవంతం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం మే నెల నుంచి దేవర2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కథలో కొన్ని కీలక మార్పులు చేసి, మొదటి భాగంతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం డిజైన్ చేస్తున్న పవర్ఫుల్ లుక్, పాత్రలో ఉండే ఇంటెన్స్ ఎమోషన్ ఈ పార్ట్‌కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్(Saif ali khan) కనిపించనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌తో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్(Dragon)తో బిజీగా ఉండగా, ఆ సినిమా అనంతరం దేవర2 షూటింగ్ మరింత వేగం అందుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








