డెస్టినీనా.. లేక జస్ట్ కోఇన్సిడెన్సా?
టాలీవుడ్లో సినిమాల సక్సెస్ లతో పాటు వాటి చుట్టూ ఏర్పడే ఆసక్తికరమైన సెంటిమెంట్లు కూడా తరచూ చర్చకు వస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోలిక సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్(ram charan) కెరీర్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గ్రామీణ నేపథ్య సినిమాల తర్వాత, కొద్ది వారాల వ్యవధిలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినమా రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం యాదృచ్ఛికమా అనే చర్చ మొదలైంది.
గతంలో రంగస్థలం(rangasthalam) విడుదలై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న తర్వాత మహానటి(mahanati) థియేటర్లలోకి వచ్చి కీర్తి సురేష్(keerthy suresh) కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇప్పుడదే తరహాలో రామ్ చరణ్ నటించిన పెద్ది(peddi) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, ఆ వెంటనే సమంత(samantha) ప్రధాన పాత్రలో రూపొందిన మా ఇంటి బంగారం(Maa inti bangaram) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించడం ఈ పోలికకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇది కేవలం యాదృచ్ఛికమే అయినప్పటికీ, రెండు సందర్భాల్లోనూ గ్రామీణ నేపథ్యంతో కూడిన రామ్ చరణ్ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఫ్యూచర్ లో కూడా ఈ సెంటిమెంట్ తో ఏమైనా సినిమాలొస్తాయా? అసలు ఇది డెస్టినీనా లేక యాదృచ్ఛిమా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.








