దసరాపై కన్నేసిన డార్లింగ్ ఫౌజీ
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అభిమానుల్లో ఇటీవలి నిరాశకు కారణమైన సినిమా ది రాజా సాబ్(The Raja Saab) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడమే. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టులపై స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం ఫౌజీ(Fauzi), స్పిరిట్(Spirit), కల్కి(Kalki 2898 AD)2 షూటింగ్‌ల మధ్య ప్రభాస్ బిజీగా గడుపుతున్నప్పటికీ, రిలీజ్ డేట్స్ మరియు షెడ్యూల్స్‌పై క్లారిటీ లేకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తాజా సమాచారం ప్రకారం ఫౌజీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా స్వాతంత్య్రానికి ముందు కాలంలో సాగే కథతో వస్తోంది. భారీ సెట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్గా ఇమాన్వీ(Imanvi) నటిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) అందిస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీగా పెట్టుబడులు పెట్టి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.
దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ కు సిద్ధం చేస్తున్న ఈ సినిమా కోసం మిగిలిన భాగాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫౌజీ పూర్తి చేసి, ఆ తర్వాత స్పిరిట్ మరియు కల్కి2898AD 2 పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు కూడా ఈ సినిమాతో తిరిగి బలమైన కంబ్యాక్ వస్తుందని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








