ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చేతుల మీదుగా “హ్రీం” మూవీ టీజర్ లాంఛ్
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “హ్రీం”. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. హారర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి రూపొందిస్తున్నారు. ఈ రోజు “హ్రీం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి మాట్లాడుతూ – హ్రీం మూవీ టీజర్ చాలా బాగుంది. నిర్మాతగా శివ మల్లాల ప్యాషన్ తెలుస్తోంది. ఆయన ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలి. హీరోయిన్ చమింద వర్మకు ఈ సినిమాతో పేరు రావాలి. అలాగే హీరో పవన్ కు కూడా ఆల్ ది బెస్ట్. రాజీవ్ కనకాల హీరో కావాల్సినవాడు. క్యారెక్టర్ యాక్టర్ గా ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారాడు. తనికెళ్ల భరణి గారు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇలాంటి అనుభవజ్ఞులైన నటులు ఈ సినిమాలో మనల్ని భయపెడుతూ ఎంటర్ టైన్ చేయబోతున్నారు. డైరెక్టర్ రాజేష్ రావూరి హ్రీం చిత్రంతో విజయాన్ని అందుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – హ్రీం అనే మంచి చిత్రాన్ని శివ మల్లాల నిర్మించడం సంతోషంగా ఉంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది. హీరోయిన్ చమింద వర్మ చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. రాజీవ్ కనకాల, బెనర్జీ, తనికెళ్ల భరణి..ఇలా కాస్టింగ్ అంతా బాగున్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు వచ్చినా ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – చిత్ర నిర్మాణం అంటే భయపడుతుంటాం. కానీ మా శివ మాత్రం ప్రొడక్షన్ లో నష్టపోడనే ధైర్యం, నమ్మకం నాకు ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఆ పరిజ్ఞానం, లౌక్యం ఉంది. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం శివకు కలగాలని కోరుకుంటున్నా. అన్నారు.
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజ్ పవన్ మాట్లాడుతూ – ఈ సినిమాకు అన్నీ తానై మా శివ గారు ముందుండి నడిపించారు. నేను వీఎఫ్ఎక్స్ చేయడానికి ఈ టీమ్ లో జాయిన్ అయినా చివరకు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు నాకే అప్పగించారు. శివ గారు నాపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశానని భావిస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ మాట్లాడుతూ – ఈ సినిమాకు ఒక జానర్ అనుకుని ఫిక్స్ అయి ఆ కాన్సెప్ట్ మీద మ్యూజిక్ చేసుకుంటూ వెళ్లాం. మధుర శ్రీధర్ రెడ్డిగారు శివగారికి నన్ను పరిచయం చేశారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. నాపై శివ గారు చాలా నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. హ్రీం సినిమా మ్యూజిక్ మీ అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నా. అన్నారు.
నటుడు రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) మాట్లాడుతూ – కొరటాల శివగారు శుభోదయం సుబ్బారావు పాత్రతో నాకు గుర్తింపు దక్కేలా చేశారు. ఇప్పుడు ఈ శివ గారు నాకు హ్రీం చిత్రంలో మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ కూడా నాకు పేరు తెస్తుందని నమ్ముతున్నాను. కోర్ట్ మూవీ తర్వాత శివ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ టైమ్ లోనే తన సినిమాలో ఒక లెంగ్తీ రోల్ ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఒక రోజు పిలిచి ఫలానా డేట్స్ లో షూటింగ్ అని అన్నారు. ఈ సినిమాలో నేను కీ రోల్ చేశాను. సినిమాలో నా పర్ ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ – శివ మల్లాల నాకు మంచి మిత్రులు. ఆయన సినిమాకు గెస్ట్ గా రావడానికి రెడీగా ఉంటాను. శివకు అన్ని క్రాఫ్టుల మీద అవగాహన ఉంది. సినిమాకు కావాల్సింది తనే రాసి చూపించగలడు. హ్రీం సినిమా టీమ్ చాలా ప్రతిభావంతంగా వర్క్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ రాజేష్ రావూరి మాట్లాడుతూ – నేను కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాలో నటించిన చాలా మంది సీనియర్ నటులు నాకు కోపరేట్ చేశారు. బాగా మూవీ చేయమనే ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చిన శివ మల్లాల గారికి థ్యాంక్స్. ఆయన ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయితే నాలాంటి కొత్తవాళ్లు మరికొందరికి అవకాశం ఇస్తారు. మా హీరో హీరోయిన్స్ పవన్, చమింద బాగా పర్ ఫార్మ్ చేశారు. మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా.అన్నారు.
యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ – శివ నాకు మంచి మిత్రుడు. ఆయన ఈ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు నేనూ నటిస్తానని అన్నాను. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది. కెమెరామెన్, డైరెక్టర్ రాజేష్, ప్రొడ్యూసర్ శివ మంచి కోఆర్డినేషన్ తో సినిమా చేశారు. ఏ సమస్య వచ్చినా వీళ్లంతా ఒక్కటిగా సాల్వ్ చేసుకునేవాళ్లు. ఈ చిత్రంలో నాకు హీరో పవన్, హీరోయిన్ చమిందతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అన్నారు.
యాక్టర్ రాజీవ్ కనకాల మాట్లాడుతూ – శివ ఈ సినిమాకు ఏ మంత్రం నేర్చుకున్నాడో గానీ తనకు కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరినీ మూవీలోకి తీసుకొచ్చాడు. నేను ఈ మూవీ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చాను. ఆ తర్వాత మూవీ కాస్టింగ్ లో ఒకరిగా మారిపోయాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. మూవీలో మిస్టిక్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ రాజేష్ తనకు ఏం కావాలో ఆ పర్ ఫార్మెన్స్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్, చమింద వర్మకు మంచి పేరొస్తుంది. వాళ్లు ఛాలెంజ్ గా తీసుకుని నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. హ్రీం టైటిల్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లి, థియేటర్స్ కు వారిని రప్పిస్తుంది. అన్నారు.

హీరోయిన్ చమింద వర్మ మాట్లాడుతూ – హ్రీం చిత్రంతో నన్ను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్న ప్రొడ్యూసర్ శివ గారికి థ్యాంక్స్. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తం శివ గారు. హ్రీం సినిమా టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ పవన్ మా మూవీకి బ్యాక్ బోన్ లా నిలిచారు. టీజర్ లో బీజీఎం అదిరిపోయింది. మా డైరెక్టర్ రాజేష్ చాలా క్లారిటీగా మాతో వర్క్ చేయించుకున్నారు. హీరో పవన్ ఛాలెంజింగ్ రోల్ చేశారు. ఇదొక యూనిక్ కాన్సెప్ట్ ఫిలిం. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని తెరపైకి వస్తాయి. మీరు మా హ్రీం సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో పవన్ తాతా మాట్లాడుతూ – శివ గారు ఒక తండ్రిలా నా బాగోగులు చూసుకున్నారు. సినిమా పరంగానే కాదు పర్సనల్ గా కూడా పవన్ కు ఇది చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం. నేను కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. అవి చూసి డైరెక్టర్ రాజేష్ నాకు ఈ కథ చెప్పారు. ఇందులో లవ్, ఎమోషన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. పర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న కథ ఇది. ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటించారు. వారితో కలిసి నటించడం వల్ల నా యాక్టింగ్ స్కిల్స్ మెరుగయ్యాయి. హీరోయిన్ చమింద వర్మతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. మా టెక్నికల్ టీమ్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నారు. వారు ఈ సినిమాకు ఇచ్చిన ఔట్ పుట్ త్వరలో స్క్రీన్ మీద మీరంతా చూస్తారు. హ్రీం సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ – దాదాపు 25 ఏళ్లుగా జర్నలిజం కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీ ముందుకు వస్తున్నాను. ఈ మొత్తం జర్నీలో నాకు మీడియా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తండ్రి లాంటి ప్రభు గారు..వీళ్లంతా నాకు సపోర్ట్ గా నిలిచి ప్రోత్సహించారు. నాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. నేనే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లాను. అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా అడుగేశాను. నేను కిందపడినా ఎంత లోతుకు పడతాను అని ఆలోచించే రిస్క్ చేశాను. క్రిటిక్ గా రివ్యూలు చెప్పేప్పుడు కూడా ఇండస్ట్రీ మనది అనే ఆలోచించాను. నెగిటివ్ చెప్పడం ఈజీ. కానీ ఆ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సినిమా అంటే సమష్టి కృషి. మనం ప్యాషనేట్ గా ఉంటే సినిమాకు వచ్చే ఏ అడ్డంకి అయినా దాటడం సులువే. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గా ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ రాజేష్ కర్ణపిశాచి అనే కథ చెప్పాడు. ఆ కథ విన్నప్పుడు అందులోని కోర్ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఈ కథ గురించి నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, సతీష్, శైలజ గారికి చెప్పాను. వాళ్లు కూడా ఈ కథ విని క్యూరియస్ గా ఫీలయ్యారు. ఇందాక స్క్రీన్ మీద ప్లే చేసిన 2 నిమిషాల వీడియో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు కారణం.
డైరెక్టర్ రాజేష్, డీవోపీ అరవింద్ 5 నిమిషాల డెమో షూట్ చేసుకుని వచ్చారు. ఆ డెమోను చెన్నైలో ఉండే నా స్నేహితుడైన సత్య సినిమా ప్రొడ్యూసర్ కు పంపాను. ఆయన చూసి ఈ డెమోకు ఎంత ఖర్చయ్యింది అన్నారు. రూపాయి కూడా ఖర్చు కాలేదు అని చెబితే సర్ ప్రైజ్ అయ్యాడు. ఇలాంటి టీమ్ బడ్జెట్ లో మంచి సినిమా చేయగలరు అని అప్రిషియేట్ చేశాడు. మా డైరెక్టర్, డీవోపీ గెరిల్లా టైప్ లో షూట్ చేసి మంచి ఔట్ పుట్ ఇస్తామని చెప్పడంతో నేను ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాను. రాజీవ్ కనకాల, బెనర్జీ గారు, భద్రమ్..ఇలా చాలా మంది సపోర్ట్ చేయడం వల్లే కాంపాక్ట్ బడ్జెట్ లో ఈ సినిమా చేయగలిగాం. వీళ్లంతా దాదాపు 150 కిలోమీటర్లు జర్నీ చేసి మా మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో షూటింగ్ చేశాం. ఆ ఊరి ప్రజలు కూడా చాలా సహకరించారు. ఇదంతా నేను కాబట్టి అయ్యింది, వేరే ప్రొడ్యూసర్ అయ్యింటే చాలా ఖర్చయ్యేది. సినిమాలో 20 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. హీరోయిన్ చమింద వర్మ దుబాయ్ నుంచి వచ్చి మా సినిమా కోసం ఏమాత్రం రెమ్యునరేషన్ ఆశించకుండా నటించింది. ఆమె ఈ సినిమాలో ఎంతో తపనతో యాక్ట్ చేసింది. ఆమెకు ఆమె మదర్ శైలజ గారికి థ్యాంక్స్. పవన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మన మీడియా నుంచి వచ్చిన పర్సన్ పవన్. అతను మన జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో మెంబర్. ఇకపై యాక్టర్ గా అతని జర్నీ బాగుండాలని కోరుకుంటున్నా. అన్నారు.








