Puri Jagannadh: పూరీ సైలెంట్ గా సెటిల్మెంట్స్ మొదలుపెట్టారా?
డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannadh)కు లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double ismart) లాంటి వరుస ఫ్లాపుల తర్వాత రూపొందిస్తున్న తాజా సినిమా స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 Temple road) టాలీవుడ్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌కి వెళ్లిపోయారు. అయితే సినిమా రిలీజ్ పై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడం ఇండస్ట్రీలో పలు ఊహాగానాలకు కారణమవుతోంది. ప్రత్యేకంగా రిలీజ్ ప్లాన్‌పై నిశ్శబ్దం కొనసాగుతుండటం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇక పూరి జగన్నాథ్‌కు లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు సంబంధించిన ఆర్థిక వివాదాలు ఇంకా పూర్తిగా ముగియకపోవడం పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ చాంబర్ వద్ద కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండగా, తెలంగాణ ఎగ్జిబిటర్లతో కూడిన వివాదాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకముందు కొత్త సినిమా విడుదలకు వెళ్లడం ప్రమాదకరమని భావిస్తున్న పూరి, తన సన్నిహితుల ద్వారా సెటిల్మెంట్స్కు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇదే కారణంగా స్లమ్ డాగ్ డిజిటల్ డీల్ కూడా ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు నిర్మాత చార్మి కౌర్(Chaarmee kaur) డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో చర్చలు జరుపుతూ డీల్స్ క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాలో టబు(Tabu), దునియా విజయ్(Duniya vijay), సంయుక్త (Samyuktha menon) ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానున్న ఈ రియలిస్టిక్ అటెంప్ట్‌తో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.








