అనిల్ తర్వాతి సినిమా ఎవరితో?
టాలీవుడ్లో మంచి కమర్షియల్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేసినా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ట్రై చేస్తుంటాడు. కొన్ని యాంగిల్స్ లో అనిల్ ని ట్రోల్ చేసినా ఆయన మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రతి సినిమాతో మంచి కలెక్షన్లు అందుకుంటున్నాడు.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్స్ ను అందించే అనిల్ అంటే హీరోలకు కూడా మంచి నమ్మకం ఉంది. ఇలాంటి డైరెక్టర్ సినిమా చేయాలని చాలా మంది హీరోలు కూడా అనుకునే విధంగా అనిల్ సినిమాలను తీస్తాడు. ప్రస్తుతం బాలయ్య తో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
అయితే భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా మంది హీరోల పేర్లు చర్చల్లో ఉన్నప్పటికీ అనిల్ మాత్రం ఈ విషయంలో ఏమీ రెస్పాండ్ అవట్లేదు. తాజా సమాచారం ప్రకారం అనిల్, తన తర్వాతి సినిమాను చిరంజీవితో చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాడట. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్న చిరూ, తన తర్వాతి సినిమాను కళ్యాణ్ కృష్ణతో చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత బింబిసార ఫేమ్ వశిష్టతో, అనిల్ తో ఒకేసారి సినిమాలను చేయాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇదెంత వరకు నిజమో చూడాలి.













