త్వరలో మూడు కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు.. రైల్వే బోర్డు ఆమోదమే తరువాయి!
MMTS Stations: హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా మూడు కొత్త ఎంఎంటీఎస్ (MMTS) స్టేషన్లను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అల్వాల్ లోని లోయోలా కళాశాల, ఆనంద్‌బాగ్, మౌలాలీ ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలను దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
స్టేషన్ల వారీగా వివరాలు..
లోయోలా కాలేజీ స్టేషన్:
ఘట్కేసర్ – సనత్‌నగర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు పెరగడంతో ఇక్కడ కొత్త స్టేషన్ అవసరం ఏర్పడింది. పదేళ్ల క్రితమే ఈ సెక్షన్లో ఆరు కొత్త స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సంఘాల విజ్ఞప్తి మేరకు అధికారులు ఇటీవల లెవల్ క్రాసింగ్‌ను సందర్శించి నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపారు.
ఆనంద్‌బాగ్‌లో స్టేషన్..
నిబంధనల ప్రకారం సబర్బన్ ప్రాంతంలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండాలి. ప్రస్తుతం చర్లపల్లి నుండి నేరేడ్మెట్ వరకు ఒక్క స్టేషన్ కూడా లేదు. మల్కాజిగిరి నివాసితులు రైళ్లు ఎక్కాలంటే నేరేడ్మెట్ లేదా చర్లపల్లి వెళ్లాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో స్టేషన్ ఏర్పాటైతే ఈ కష్టాలు తప్పుతాయి.
మౌలాలీ క్వార్టర్స్ సమీపంలో..
మౌలాలీలోని రైల్వే క్వార్టర్స్ వద్ద సుమారు 2 వేల నివాసాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త స్టేషన్ నిర్మిస్తే, అక్కడి నివాసితులందరికీ ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇవి కూడా చదవండి








