మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా మద్దతు : బండి సంజయ్
మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ (Parliament) లో బిల్లుకు మద్దతివ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు బుద్ధి చెబుతారన్నారు. మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని, మహిళా రిజర్వేషన్ బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. మహిళల ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) ప్రతీక. పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే. డీలిమిటేషన్తో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. తెలంగాణ (Telangana) అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. ఈ నెల 16నుంచి 18 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. చట్టాన్ని 2029 లోక్సభ ఎన్నిలకు ముందే అమలులోకి తెచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి








