ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి, స్టాలిన్ కు చెంపపెట్టులాంటివి : బండి సంజయ్
ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ లోని పీఎంజే జ్యువెల్లరీ (PMJ Jewellery) దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర హోంమంత్రి శాఖ సహాయమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బాధిత కుటుంఆలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణం యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు.
ఇవి కూడా చదవండి








