మంత్రి పదవిపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు
తనకు మంత్రి పదవి (Ministerial Post) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) చెప్పలేదని, తాను కూడా అడగలేదని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం (Kodandaram) వెల్లడించారు. అయితే తమ పార్టీకి ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని మాత్రం అడుగుతున్నామన్నారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాటాడారు. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని, ముందునుంచే నియోజకవర్గాలను ఎంచుకుని పని చేస్తామని పేర్కొన్నారు. టీజేఎస్ ప్లీనరీ (TJS Plenary) మే 12న జరగనుందని, అందులో పార్టీ భవిష్యత్తుపైన కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








