టాలెంట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు : మంత్రి కొండా సురేఖ
యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యానించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. యువత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. టాలెంట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు (Jobs) వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సమాజంలో ఇప్పటి జనరేషన్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. మనం తప్పు చేయనంతవరకూ ఎవరికీ భయపడొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య *Kadiyam Kavya), ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ సత్యశారదదేవి (Satyasharadadevi) పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








