డిజిటల్ చెల్లింపుల్లో కొత్త ప్రమాదం.. ఫ్రీ ట్రయల్ ముగియగానే ఖాతా ఖాళీ!
Auto Payment: సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల పేరిట వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు సూచిస్తోంది. ఉచిత ట్రయల్స్ పేరుతో యాప్‌లను డౌన్లోడ్ చేయించి, తద్వారా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఈ మోసం ఎలా జరుగుతుందంటే..
సోషల్ మీడియాలో సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ఆకర్షణీయ ప్రకటనలు కనిపిస్తాయి. ఆసక్తితో ఆ యాప్‌లను డౌన్లోడ్ చేయగానే, ‘ఫ్రీ ట్రయల్’ ఆప్షన్ కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అనుసంధానించమని అడుగుతాయి. ఉచితమని పేర్కొన్నప్పటికీ, ‘ఆటో పేమెంట్’ ఐచ్ఛికాన్ని (Option) ఓకే చేస్తేనే యాప్ పనిచేస్తుంది. ఉచిత గడువు ముగియగానే, యూజర్లకు తెలియకుండానే వారి ఖాతా నుండి నేరుగా నగదు డెబిట్ అవుతుంది. ఒక్కసారి అనుమతి ఇస్తే, మన ప్రమేయం లేకుండానే యాప్‌లు డబ్బును బదిలీ చేసుకుంటాయి. కేవలం యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసినా పేమెంట్ ఆగదు. సబ్‌స్క్రిప్షన్‌ను మాన్యువల్‌గా క్యాన్సిల్ చేస్తేనే నగదు బదిలీ ఆగుతుంది.
వీటిని నిలిపివేసే విధానం..
ఆండ్రాయిడ్ ఫోన్లలో: ప్లే స్టోర్‌లోని ‘పేమెంట్స్ & సబ్స్క్రిప్షన్’ ఆప్షన్‌లోకి వెళ్లి, అనవసరమైన వాటిని క్యాన్సిల్ చేయాలి.
ఐఓఎస్ (iOS) ఫోన్లలో: సెట్టింగ్స్‌లో ‘యువర్ నేమ్’ తర్వాత ఉండే ‘సబ్స్క్రిప్షన్’ విభాగంలో వీటిని నిలిపివేయవచ్చు.
యూపీఐ యాప్‌లలో: ప్రొఫైల్లోకి వెళ్లి ‘ఆటో పే’ ఆప్షన్లో ‘రివోక్’ (Revoke) ఎంచుకోవడం ద్వారా ఆటోమేటిక్ పేమెంట్లను ఆపవచ్చు.
ఇవి కూడా చదవండి








