టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కిషన్ రెడ్డి దమ్ముంటే నియోజకవర్గాల పెంపు బిల్లుకు ఆమోదం తెలుపాలన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారన్నారు. తమతో ఉంటే ట్రెజరీ బెంచ్‌లో కూర్చున్నాడని, తమను విడిచాక రోడ్డుమీద కూర్చున్నాడని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.








