ఐపీఎస్ విశాల్ గున్నికి హైకోర్టు లో ఎదురుదెబ్బ
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని (Vishal Gunni)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ సస్పెన్షన్ను రద్దు చేస్తూ గతేడాది క్వాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై లోతైన విచారణ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. సినీనటి కాదంబరీ జత్వాని (Kadambari Jethwani) అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం కేసులో విశాల్ గున్నిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్పై విశాల్ గున్ని క్వాట్ (Quote) ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్ సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని గతేడాది ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
క్యాట్ ఉత్తర్వులను ఏపీ సీఎస్, డీజీపీలు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సస్పెన్షన్ కాల పరిమితి ముగియక ముందే ఉత్తర్వులను క్వాట్ రద్దు చేసిందని, దీంతో విచారణ ముందుకు వెళ్లలేదని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. విశాల్ గున్ని తరుపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనల అనంతరం క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 29కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి








