Chandrababu:ఉద్యాన పంటల్లో రాయలసీమ పపంచంలోనే నెంబర్ 1 చేస్తా : చంద్రబాబు
ఉద్యాన పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. వ్యవసాయ రంగ బడ్జెట్ పై శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమ (Rayalaseema)లో ఉద్యానపంటల దిగుబడుల్ని నాలుగు వందల మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామన్నారు. ఐదేళ్ల వైసీపీ (YCP)పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధి కి చర్యలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృ త్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపట్టామని ప్రకటించారు.
ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మందిని మళ్లించాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం ఉద్యాన పంటల కేంద్రంగా రాయలసీమ ఉంది. రాయలసీమలోని 20 లక్షల హెక్టార్ల ఉద్యానపంటల్ని 40 లక్షలకు హెక్టార్లకు పెంచుతాం. దిగుబడులను వెయ్యి మిలియన్ టన్నులకు పెంచుతాం. రూ.30 వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తాం. మౌలిక వసతులకు రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివద్ధి చేస్తాం. భూగర్భ జలాలు పెంచి నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలి. రైతులు కూడా ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి. అందరికీ ఇళ్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గహప్రవేశాలు చేయిస్తాం. ఈ ఏడాది చివరినాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది. హౌసింగ్‌లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తోంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం చేస్తాం. ఇళ్ల నిర్మాణం (House construction) ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తాం. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసింది. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లనూ త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం. 2029లోగా అందరికీ ఇంటి స్థలాలూ, ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తున్నా అని అన్నారు.
ఇవి కూడా చదవండి








