స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• సమావేశానికి హాజరైన సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు
• భారత్ సంస్కరణలతో దూసుకుపోతున్న అతి పెద్ద ఆర్ధికశక్తి
• ప్రధాని మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారు
ఇవి కూడా చదవండి
• చైనా లాంటి దేశాలు ఆర్ధిక అభివృద్ది సాధించటానికి దశాబ్దాల కాలం పట్టింది. కానీ భారత్‌కు అంత సమయం పట్టటం లేదు
• మెడికల్ టెక్నాలజీ సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
• ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ సహా ఇతర ఉత్పత్తులు వస్తున్నాయి
• డెమోగ్రాఫిక్ డివిడెంట్‌తో అతిపెద్ద యువశక్తి కలిగిన మానవ వనరులను భారత్ కలిగి ఉంది.
• తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో మేం వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం
• భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా ప్రాజెక్టులకు భూములు ఇస్తున్నాం. అమరావతి రాజధాని ఈ ప్రాతిపదికనే నిర్మిస్తున్నాం
• ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చి భూములు కేటాయించాం.
• వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం. పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను
• శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి.
• పౌర సేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉంది
• వెంచర్ కాపిటలిస్టులు ఆ సంస్థ తయారు చేసిన స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉంది
• అత్యుత్తమ ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నాను.









