శివసేన పేరు, గుర్తు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్రలో రెండు వర్గాలుగా విడిపోయిన శివసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఇటీవలే షాకిచ్చింది. పార్టీ పేరు, గుర్తును స్తంభింపజేసింది. ఇరు వర్గాలు కూడా మూడు పేర్లు, గుర్తులను సూచించాలని.. వాటిలో ఒకదాన్ని కేటాయిస్తామని చెప్పి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసిన మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ గుర్తు, పేరును స్తంభింపజేస్తే ఈ నెల 8న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరింది. తమ వాదనలు వినకుండానే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది చట్టవిరుద్ధమని థాకరే వర్గం వాదించింది. ఈ పిటిషన్లో ఎన్నికల సంఘం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలను ప్రతివాదులుగా చేర్చింది. కాగా, ఈసీ అడిగినట్లే తమ వర్గం కోసం ‘శివసేన బాలాసాహెబ్ థాకరే’, ‘శివసేన బాలాసాహెబ్ ప్రబోధంకర్ థాకరే’, ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ అనే మూడు పేర్లలో ఒకదాన్ని ఎంపిక చేయాలని ఉద్ధవ్ వర్గం ఆప్షన్స్‌ను ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఉద్ధవ్ థాకరేనే వెల్లడించిన సంగతి తెలిసింద. సమర్పించినట్లు తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమకు గుర్తు, పేరు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. శిందే వర్గం సైతం తమ ఐచ్ఛికాలను సమర్పించిందని ఈసీ అధికారులు తెలిపారు.








