మాటా రెండో మహాసభలు.. వివిధ కార్యక్రమాలు
అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమం తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) రెండో వార్షిక మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 2026 జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో గల గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు రూపొందించిన ఈ కన్వెన్షన్ కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, సాంకేతిక, ఆరోగ్య వ్యాపార రంగాల్లో వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరించనుంది.
ఎన్నెన్నో కార్యక్రమాలు..
మాటా రెండో కన్వెన్షన్లో భాగంగా భద్రాచల దేవస్థానం నుండి ప్రత్యేకంగా విచ్చేసే అర్చకుల సమక్షంలో శ్రీ సీతారామ కల్యాణం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరిగే ఈ క్రతువులో భద్రాద్రి నుండి తెచ్చిన దివ్య విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. భక్తులకు పవిత్ర ప్రసాదం తలంబ్రాలు అందజేస్తారు. ఆధ్యాత్మికతతో పాటు యువతను ప్రోత్సహించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు రామ్ మిర్యాల వంటి ప్రముఖ కళాకారులతో కూడిన సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.
సంగీత పోటీలు..
సాంకేతిక రంగంలో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం మాటా ఫిలడెల్ఫియాలో ఫ్యూచరిస్టిక్ ఏఐ హ్యాకథాన్ను నిర్వహిస్తోంది. మిడిల్ స్కూల్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థుల వరకు పాల్గొనే ఈ పోటీలో విజేతలకు 1000 డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే వర్ధమాన గాయకుల కోసం మాటా సింగింగ్ స్టార్ పోటీలను ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ రామచారి కొమ్మండూరి పర్యవేక్షణలో చేపడుతున్నారు. వీటితో పాటు జనవరి నుండి ప్రారంభమైన 100 రోజుల ఫిట్నెస్ ఛాలెంజ్ విజేతలకు కూడా కన్వెన్షన్ వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నారు.
మాటా – వాలీబాల్ టోర్నమెంట్
మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో క్రీడాభిమానుల కోసం ప్రతిష్టాత్మకమైన ‘మాటా వాలీబాల్ టోర్నమెంట్ 2026’ను నిర్వహించనున్నారు. మే 23వ తేదీ (శనివారం) ఉదయం 8:00 గంటలకు మిచిగాన్లోని ‘స్పార్క్ ఎరీనా’ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే జట్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి మే 21, 2026 వరకు గడువు ఉంది. పరిమిత స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల క్రీడాకారులు https://tinyurl.com/MATAVolleyBall లింక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ క్రీడా సంబరాన్ని జయప్రదం చేసేందుకు మాటా ప్రతినిధులు మనోజ్ బతిని, సత్య మైనంపాటి, కో-చైర్ అముల్య రామన్నగారితో పాటు అక్షర గొల్లపల్లి, రాజ్ గుప్తా, లక్ష్మీ ప్రియ, అరవింద్ రెడ్డిగారి, భరత్ ఎరుకల కృషి చేస్తున్నారు.
జూన్ 19 నుండి 20 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న ‘మాటా 2వ మహాసభల’ ప్రచారంలో భాగంగా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. తెలుగు కమ్యూనిటీలో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ‘మాటా’ కార్యవర్గ సభ్యులు రమణ కిరణ్ దుగ్గిరాల (ప్రెసిడెంట్), ఇతర సభ్యులు కోరారు.
ఆరోగ్య శిబిరాలు..
సామాజిక బాధ్యతలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రతి నెలా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ, కమ్యూనిటీకి మాటా తన వంతు సహకారం అందిస్తోంది. ప్రతి నెలా ఆఖరి శనివారం ఇమ్మిగ్రేషన్, ఫ్యామిలీ లా రియల్ ఎస్టేట్ అంశాలపై నిపుణులైన న్యాయవాదులతో లీగల్ సెమినార్లు కూడా జూమ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల విజయానికి కిరణ్ దుడ్డగి నేతృత్వంలోని కార్యవర్గ బృందం వివిధ కమిటీ సభ్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక వెండర్ బూత్లు సావనీర్ ప్రకటనల సౌకర్యం కూడా కల్పించారు. మరింత సమాచారం కోసం www.mata-us.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.
మహిళల త్రోబాల్ టోర్నమెంట్
మన అమెరికన్ తెలుగు సంఘం జూన్ 2026లో నిర్వహించనున్న 2వ మహాసభల సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట’ను నిర్వహిస్తోంది. “అథ్లెటిసిజం, ఐక్యత , మహిళా శక్తి”ని చాటిచెప్పే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. బహుమతులు: విజేతలకు , రన్నర్లకు జూన్ 19-20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జరిగే MATA 2nd Convention వేదికపై ట్రోఫీలను అందజేస్తారు.
ఆసక్తి గల వారు https://tinyurl.com/ MATAThrowBall లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మహి (610-888-3318), జై (712-265-1151), లేదా రాజా (732-372-3603) లను సంప్రదించవచ్చు లేదా cశీఅఙవఅవతీఏఎata-us.శీతీస్త్రకి ఈమెయిల్ చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాటాఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జిలేందర్ రెడ్డి, రమణ కిరణ్ దుగ్గిరాల, ఇతర సభ్యులు కోరుతున్నారు.
న్యాయ సదస్సు
మన అమెరికా తెలుగు సంఘం (మాటా) సామాజిక బాధ్యతలో భాగంగా ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా నెలవారీ న్యాయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 25 శనివారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి 1:30 గంటల వరకు ఆన్లైన్ వేదికగా జరగనుంది. ముఖ్యంగా దక్షిణాసియా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న కీలకమైన న్యాయ వలస సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడమే ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశం.








